Project : మూసికి కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. గేట్లు ఎత్తి నీటి విడుదల..!

Project : మూసికి కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. గేట్లు ఎత్తి నీటి విడుదల..!

సూర్యాపేట రూరల్, మన సాక్షి :

ఎగువనుంచి భారీగా వరద నీరు వచ్చి మూసి ప్రాజెక్టులో చేరడంతో నదిలో నీటి మట్టం పెరిగింది. దీంతో ఇవ్వాల (సోమవారం) 644.60 అడుగుల లెవల్​కు వాటర్​ చేరింది.

ALSO READ : Railway Stations : విదేశాలకు వెళ్లేందుకు ఫ్లైటే కాదు.. భారత్ లో ఏడు రైళ్లు..! అవి ఎక్కడో తెలుసుకుందాం..!

 

ఇక.. ప్రాజెక్టు నీటి మట్టం 645 అడుగులు కాగా, ఇంకా ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 243.16 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు.ప్రాజెక్ట్ నుండి 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.

 

దీంతో అధికారులు ఉదయం 3 క్రస్ట్​ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో డీఈ చంద్రశేఖర్, ఏఈలు ఉదయ్ కుమార్, మమత, ఇరిగేషన్​ సిబ్బంది ఉన్నారు.