Nalgonda : క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తే సీఎం కు పాలాభిషేకం చేస్తాం.. లేదంటే 5వేల మంది జర్నలిస్టులతో సచివాలయం ముట్టడి..!
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం తరహాలోనే వర్కింగ్ జర్నలిస్టు లందరికీ క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తే రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ రేవంత్ రెడ్డికి పాలాభి షేకం చేస్తామని, జర్నలిస్టులకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకుంటే అక్రిడేషన్ కార్డులు కలిగిన జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న 5000 మందితో రాష్ట్ర సచివాలయాన్ని టియుడబ్ల్యూజే 143 ఆధ్వర్యంలో ముట్టడిస్తామని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ అన్నారు.

Nalgonda : క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తే సీఎం కు పాలాభిషేకం చేస్తాం.. లేదంటే 5వేల మంది జర్నలిస్టులతో సచివాలయం ముట్టడి..!
— టీ యూ డబ్ల్యూ జె 143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్
నల్గొండ, మన సాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం తరహాలోనే వర్కింగ్ జర్నలిస్టు లందరికీ క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తే రాష్ట్ర ముఖ్య మంత్రి ఏ రేవంత్ రెడ్డికి పాలాభి షేకం చేస్తామని, జర్నలిస్టులకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకుంటే అక్రిడేషన్ కార్డులు కలిగిన జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న 5000 మందితో రాష్ట్ర సచివాలయాన్ని టియుడబ్ల్యూజే 143 ఆధ్వర్యంలో ముట్టడిస్తామని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ అన్నారు.
బుధవారం మునుగోడు నియోజకవర్గ టి యుడబ్ల్యూజే 143 వర్కింగ్ జర్నలిస్టులు నాంపల్లి మండలం లోని తుంగపాటి గౌరారం శ్రీశ్రీ చలిదొన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం సభ్యత్వ నమోదు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జర్నలి స్టులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న స మస్యల ను వెంటనే పరిష్కరిం చాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంటి స్థలాలను ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల అభివృద్ధి కోసం మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ గత ప్రభుత్వంతో పోరాడి సంక్షేమ నిధిని సాధించడం వల్ల సమస్యల వలయంలో ఉన్న అనేక జర్న లిస్టు కుటుంబాలకు యూనియన్ అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమ నిధిని ఒక్క రూపాయి కూడా పెంచలేదని, ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ సంక్షేమ నిధి కోసం ఏమాత్రం ప్రయత్నించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
టియుడబ్ల్యూజే 143 నల్లగొండ జిల్లా అధ్యక్షులు గుండగోని జ యశంకర్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చురుకుగా కొనసాగించాలని, నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ముందుగా మునుగోడు నియోజ కవర్గ సమావేశం నాంపల్లి మండ లంలో ఏర్పాటు చేయడం, అభినందనీయమని కమిటీ సభ్యులను అభినందించారు.
సభ్యత్వ నమోదు ప్రారంభం :
ఈ కార్యక్ర మంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మా రుతి సాగర్ చేతులమీదుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తెంజు రాష్ట్ర కార్యదర్శి ఏ రమ ణ, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, ఐజే యు కౌన్సిల్ మెంబర్ తిరుపతి నాయక్,
రాష్ట్ర నాయకులు వర్ధిల్లి వెంకన్న గౌడ్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు వీరస్వామి, ఉప కార్యదర్శి శివప్రసాద్, యూనియన్ రాష్ట్ర నాయకులు
అన్న బోయిన మట్టయ్య, గోలి విజయ్, మునుగోడు యూనియన్ ప్రధాన కార్యదర్శి కోడి రాము లు, మునుగోడు నియోజకవర్గం ఉపాధ్యక్షులు కామ్ శెట్టి యాదయ్య, మట్టయ్య, సీనియర్ పాత్రి కేయులు ఈద శేఖర్, నకిరేకల్ టి యుడబ్ల్యూజె నియోజకవర్గం నుంచి కొమ్ముగిరి, రమేష్, రామ సాయిలు, మిర్యాలగూడ నుంచి లక్ష్మణ్, మల్లె నాగిరెడ్డి, బొంగరాల మట్టయ్య, దేవరకొండ నుంచి ఆంజనేయులు, నారాయణ, నల్లగొండ నుంచి పిల్లలమర్రి శ్రీని వాస్, మధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూ జే నాంపల్లి మండల శాఖ వెంకటే శ్వర్లు కార్యక్రమాన్ని ముందు వ రుసలో ఉండి నడిపించారు. యూనియన్ నాయకులు కూ ర్పాటి శ్రావణ్ కుమార్, సిహెచ్ శ్రీను, గాలెంక వినోద్ కుమార్, పెద్దిరెడ్డి అనంత రెడ్డి, మర్రిగూ డెం మండల అధ్యక్ష కార్యదర్శు లు రమేష్, యాదయ్య, రఘు, మహేశ్వరం సతీష్, గట్టుప్పల మండలం నుండి గజం శ్రావణ్ కుమార్, కార్యక్రమంలో పాల్గొ న్నారు.
శ్రీ ఏకశిలా చలిదన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఒట్టికోటి రవిని యూని యన్ శాలువా కప్పి సన్మానిం చా రు. సమావేశానికి హాజరైన ప్ర ముఖులకు శాలువాలు కప్పి మె మొటోలు అందజేసి యూనియ న్ తరపున అభినందనలు తెలి పారు.