Nalgonda : వెంకటాపురంలో అట్టహాసంగా జిల్లా స్థాయి ఎడ్ల పందాలు..!
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలు అట్టహాసంగా ముగిశాయి.

Nalgonda : వెంకటాపురంలో అట్టహాసంగా జిల్లా స్థాయి ఎడ్ల పందాలు..!
గుర్రంపోడు, మన సాక్షి:
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలు అట్టహాసంగా ముగిశాయి. తెలంగాణ గిత్తల బల ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన ఈ పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపాయి.ఈ పోటీలను వెంకటాపురం సర్పంచ్ మల్లోజు రామాచారి, ఉట్లపల్లి సర్పంచ్ భీమనపల్లి శ్రావణి శ్రీను బాబు, ప్రారంభించారు.
భూపతి రాజు, మాజీ సర్పంచ్ బచ్చిన బోయిన శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ సంస్కృతిని, రైతు క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇలాంటి పోటీలు రైతుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన మేలు రకం గిత్తలు ఈ పోటీల్లో తమ ప్రతాపాన్ని చాటాయి.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ పందాల్లో విజేతలుగా ప్రథమ బహుమతి అనుముల గ్రామానికి చెందిన గిత్తలు కైవసం, ద్వితీయ బహుమతి వెంకటాపురం గ్రామానికి చెందిన గిత్తలు,తృతీయ బహుమతి: కాల్వపల్లి గ్రామానికి చెందిన గిత్తలు, నాల్గవ బహుమతి తిరిగి ఆతిథ్య గ్రామం వెంకటాపురం గిత్తలకే దక్కింది.
ఈ పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు, యువకులు మరియు ఎడ్ల పందాల అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేరింతలు, ఈలల మధ్య గిత్తల బల ప్రదర్శన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులు మరియు గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
MOST READ









