Nalgonda : రూ.125 కోట్ల 78 లక్షలతో మునిసిపల్ బడ్జెట్..!
Nalgonda : రూ.125 కోట్ల 78 లక్షలతో మునిసిపల్ బడ్జెట్..!
- పన్నుల వసూలుతో ఆదాయం పెంచుకోవడంపై దృష్టి
- ఆమోదించిన సభ్యులు
- పాఠశాలలను బలోపితం చేయాలి – ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నల్లగొండ, మనసాక్షి :
నల్లగొండ మునిసిపల్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. గతేడాదికన్నా దాదాపు రూ.కోటి ఆదాయం అదనంగా వస్తుందని అంచనా వేస్తూ రూ. 125 కోట్ల 78 లక్షల తో అంచనా బడ్జెట్‌ను రూపొందించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మునిసిపల్ సమావేశ మందిరంలో మునిసిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగు బె ల్లి నర్సిరెడ్డి
ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా బడ్జెట్ ము ఖ్యప్రతిని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2023-24 సంవత్స రంలో రూ.52 కోట్ల 44 లక్షలు బడ్జెట్ ప్రవేశపెట్టగా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 125 కోట్ల 78 లక్షలతో బడ్జెట్‌ను రూపొందించారు. గతంలో కన్నా పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేశారు అంటే సాధార ణ పన్నులతో పాటు మొండిబకాయిల వసూళ్లపై మునిసిపల్ దృష్టి సారించ ఉన్నట్లు తెలుస్తుంది . పన్నులతోపాటు అద్దె ఆదాయం రూపంలో పెద్దఎత్తునపాత బకాయిలు ఉండగా వాటి వసూళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్‌ను పెంచుకోనున్నట్లు స్పష్టమవుతోంది.
ALSO READ : VH : సీఎం రేవంత్ పై విహెచ్ కీలక వ్యాఖ్యలు..!
ప్రస్తుత సంవత్సరం ముగిసేనాటికి రూ.704.85 లక్షలు కోట్లు మిగులు బడ్జెట్ ఉండనుందని, ఈ బడ్జెట్ ప్రస్తుత అంచనా బడ్జెట్ రూ.11873.55 కోట్లు కలిపి రూ.12578.40 లక్షలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ ఏడాది ఖర్చులను అంచనా వేయగా రూ.5212.04 లక్షలు ఖర్చుగా చూయిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం ముగసేనాటికి రూ.772.83 లక్షలు కోట్ల మిగులు చూయించారు.
పన్నుల వసూలు ద్వారా ఆదాయం పెంచుకో వడంపై దృష్టి సారించారు. పన్నుల రూపంలో రూ.2750.00 లక్షలు ఆదాయం వస్తుందని, అద్దెల రూపంలో రూ.5.00 లక్షలు , పారిశుధ్య విభాగం ద్వారా రూ.60.00 లక్షలు , టౌన్‌ప్లానింగ్ ద్వారా రూ.1600.00 లక్షలు , ఇంజనీరింగ్ విభాగం ద్వారా రూ.60.00 లక్షలు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. టౌన్‌ప్లానింగ్ ఆదాయంపై ఈ ఏడాది పెద్దగానే ఆశలు పెట్టుకున్నారు. గతేడాది బడ్జెట్లో టౌన్ ప్లానింగ్ ద్వారా రూ.200.00 లక్షలు అంచనా వేయగా ఈఏడాది అదనంగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు. బడ్జెట్‌ను అన్ని పార్టీల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
పాఠశాలలను బలోపితం చేయాలి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి .
నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో 24 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, అందులో నాలుగు పాఠశాల లో మాత్రమే ఎక్కువ విద్యార్థులతో చదువుతున్నారని మిగతా 20 పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువైందని తెలిపారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు, పరిరక్షణ బాధ్యతగా తీసుకొని వెనుకబడిన పాఠశాలలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు అభివృద్ధిపై సభ్యులంతా దృష్టి సారించాలని, వచ్చే ఏడాదికాలం అందరికీ చాలా ముఖ్యమైనదని, ఈ ఏడాది చక్కగా పనులు చేసుకుంటే వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లవచ్చని అన్నారు.
ALSO READ : Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. మరో మూడు రోజులే ఛాన్స్..!
సభ్యులు సూచించిన అన్ని సమస్యలను నోట్ చేసుకున్నామని, వాటన్నింటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మునిసిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతంగా బడ్జెట్‌ను రూపొందించారన్నారు. నాలుగేళ్లుగా అభివృద్ధికి దూరం గా ఉన్న కాలనీలు, మురికివాడల అభివృద్ధికి ప్రాధా న్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాద్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సమస్యలపై గళ మెత్తిన కౌన్సిల్ సభ్యులు.
నల్లగొండ పురపాలిక సమస్యలపై పార్టీలకతీతంగా సభ్యులు గళమె త్తారు. వార్డు సమస్యలతో పాటు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలువురు సభ్యులు వార్డుల్లో నెలకొన్న సమస్యలు వివరించారు. నల్లగొండ పట్టణంలోని హిందూపూర్ స్మశాన వాటిక నిర్మాణంలో అవినీతి జరిగిందని వెంటనే విచారణ చేపట్టాలని అవార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పేర్కొన్నారు.
అందరికీ మాట్లాడే స్వేచ్ఛ: చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిని పరిష్కరిస్తామని మునిసిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇది వరకు సభ్యులకు మాట్లాడే అవకాశం ఉండకపోయేదని, స్వేచ్ఛా పాలనలో సభ్యులంతా తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకుంటున్నారని, ఇదే మార్పు అని చెప్పారు. గతంలో అభివృద్ది పేరు చెప్పుకుని కాలనీలను బో పూర్తిగా విస్మరించారని ఇప్పుడు ఆ కాలనీలన్నీ అభివద్ది చేసుకుందామని, పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు.
తెలుగులో బ్రేకింగ్ న్యూస్ మన సాక్షిలో చదవండి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ చదవండి.










