Nalgonda : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు..!
రాష్ట్రంలో రానున్న రెండు సంవత్సరాలలో 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Nalgonda : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు..!
నల్లగొండ,, మనసాక్షి.
రాష్ట్రంలో రానున్న రెండు సంవత్సరాలలో 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మొదటి అంతస్తును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాక్ ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన న్యాక్ భవనాలలో నల్గొండ న్యాక్ మొదటిదని తెలిపారు. నల్గొండ న్యాక్ కేంద్రం ద్వారా వివిధ రకాల కోర్సులలో ముఖ్యంగా ఎలక్ట్రిషన్, ప్లంబర్ ,మెకానిక్, వెల్డర్, డెకరేషన్, కార్పెంటర్, సి సి టీవీ, కంప్యూటర్ తదితర విభాగాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, రాబోయే కాలంలో మరిన్ని కోర్సులలో శిక్షణను ఇస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కార్మిక శాఖ కారంతో న్యాక్ ఆధ్వర్యంలో 60 మంది మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేశారు .న్యాక్ ద్వారా అత్యాధునిక కోర్సులలో సైతం శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. యువతలో నిరాశ పెరగకుండా నైపుణ్యాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం రాష్ట్ర స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుందని, అంతేకాక జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండేళ్లలో 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామని తెలిపారు.
నల్గొండ జిల్లా కేంద్రంలో 84 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ను ఇదివరకే ప్రారంభించుకోవడం జరిగిందని, 5 కోట్ల రూపాయలతో వివిధ రకాల కోర్సులలో శిక్షణ ఇచ్చేందుకు సెట్విన్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 20 కోట్లతో న్యాక్ భవనాన్ని పూర్తిచేసినట్లు తెలిపారు. ఎక్కువమంది నిరుద్యోగులు ఉన్న జిల్లా నల్గొండ అని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వారాధి సంస్థ ద్వారా వంద మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకుగాను ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా జాక్వార్ సంస్థ ద్వారా 25 లక్షల రూపాయల వ్యయంతో లేబరేటరీ ఏర్పాటు చేసేందుకు కూడా ఎంఓయూను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రపతి ద్వారా అవార్డు పొందిన ఇన్స్ట్రక్టర్ స్నేహలతను శాలువాతో సన్మానించారు.జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా నిర్మాణ రంగంలో జిల్లా యువతకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఐటిఐ, పాలిటెక్నిక్, సివిల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు చేసిన వారికి ఆధ్యాత్మిక కోర్సుల ద్వారా శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఉద్దేశం అని తెలిపారు. నల్గొండ న్యాక్ లో సాధ్యమైనంత తొందరగా కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
న్యాక్ ద్వారా శిక్షణ పొందిన సర్టిఫికెట్ అన్ని ఉద్యోగాలకు పనికొస్తుందన్నారు. న్యాక్ డిజీఎం నాయక్ మాట్లాడారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్, న్యాక్ ఇంజనీరింగ్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
MOST READ
-
TG News : మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి నామినేషన్లు..!
-
Nalgonda : రూ.30 లక్షల వ్యయంతో హెల్త్ ఎటిఎం.. ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి..!
-
Medaram : మేడారం సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు.. ప్రాంగణంలో హకా నృత్య ప్రదర్శన!
-
Miryalaguda : మిర్యాలగూడలో అన్నపూర్ణ అభయ హస్తం.. రూ.5 భోజనం ఏర్పాటు..!









