Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతరలుతెలంగాణ

Medaram : మేడారం సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు.. ప్రాంగణంలో హకా నృత్య ప్రదర్శన!

ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా న్యూజిలాండ్‌కు చెందిన మావోరీ గిరిజన ప్రతినిధులు సోమవారం మేడారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మేడారం గద్దెల ప్రాంగణంలో మావోరీ గిరిజనుల సాంప్రదాయ నృత్యమైన 'హకా' నృత్యాన్ని ప్రదర్శించారు.

Medaram : మేడారం సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు.. ప్రాంగణంలో హకా నృత్య ప్రదర్శన!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా న్యూజిలాండ్‌కు చెందిన మావోరీ గిరిజన ప్రతినిధులు సోమవారం మేడారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మేడారం గద్దెల ప్రాంగణంలో మావోరీ గిరిజనుల సాంప్రదాయ నృత్యమైన ‘హకా’ నృత్యాన్ని ప్రదర్శించారు.

యుద్ధానికి వెళ్లే ముందు తమ సైనికులలో మనోధైర్యాన్ని నింపడానికి, శత్రువులలో భయాన్ని కలిగించడానికి మావోరీ గిరిజనులు ప్రదర్శించే సాంప్రదాయ నృత్యంగా హకా నృత్యం ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలోని ముఖ కవళికలు, శరీర కదలికలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.

తెలంగాణ-న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరీ గిరిజన ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హకా నృత్య ప్రదర్శన సమయంలో మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యంలో పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గిరిజన సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డంకి కావని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజనులు తమ జీవనోపాధి కోసం అడవిపై, ప్రకృతిపై ఆధారపడతారని అన్నారు.  అనంతరం, మావోరీ గిరిజన ప్రతినిధులను గద్దెల వద్దకు తీసుకెళ్లి వన దేవతల దర్శనం చేయించారు.

మంత్రి సీతక్క స్వయంగా వారికి సమ్మక్క-సారలమ్మ వన దేవతల మహిమ, చరిత్రను వివరించి వన దేవతలకు బంగారాన్ని, మొక్కుబడులను సమర్పించి, మావోరీ గిరిజన ప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిణి చిత్ర మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Alumni : 35 ఏళ్ల నిరీక్షణకు తెర.. సూర్యాపేటలో మిత్రుల జ్ఞాపకాల హరివిల్లు..!

  2. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

  3. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  4. Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

మరిన్ని వార్తలు