Breaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసంగారెడ్డి జిల్లా
Sangareddy : తడ్కల్ లో జొన్నల కేంద్రం.. కంగ్టిలో టోకన్ల పంపిణీ..!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికి టోకెన్లను మండల కేంద్రమైన కంగ్టిలో పంపిణీ చేయడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Sangareddy : తడ్కల్ లో జొన్నల కేంద్రం.. కంగ్టిలో టోకన్ల పంపిణీ..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికి టోకెన్లను మండల కేంద్రమైన కంగ్టిలో పంపిణీ చేయడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధ రైతులు రాకపోకల్లో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం ఎక్కడ ఉంటే అక్కడే టోకెన్ల పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులకు కోరుతున్నారు. శనివారం కంగ్టి లో టోకెన్ పంపిణీ చేయడంతో ఒకేసారి మండలానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున వచ్చారు.









