రహదారులకు ఇరువైపులా టెకోమ మొక్కలు నాటాలి –  నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

రహదారులకు ఇరువైపులా టెకోమ మొక్కలు నాటాలి –  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నారాయణపేట , అక్టోబర్ 12, మన సాక్షి : నారాయణపేట జిల్లా లో రహాదారులకు ఇరువైపులా టేకోమా పూల మొక్కలను నాటి పట్టణానికి సుందరికరణ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరితహారం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. నారాయణపేట నుండి జిల్లా సరిహద్దు వరకు గల 19 గ్రామ పంచాయతీ పరిధిలోని లోని రహదారులకు ఇరువైపులా మూడు ఫీట్ ల మొక్కలను నాటాలని, మొక్కల మధ్య దూరం 1.5 మీటర్లు ఉండేటట్లు చూసుకోవాలన్నారు. జాతీయ రహదారుల గలిగిన గ్రామ పంచాయతీ సెక్రటరీలు, అటవీ శాఖ అధికారుల సహాయంతో టెకోమ, పూల మొక్కలను నాటాలన్నారు. అటవీ శాఖ కు సంబంధించిన నర్సరీలు, గ్రామ పంచాయతీ నర్సరీలో గల మొక్కలను తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వర్షాల బాగా పడుతున్న కారణంగా మొక్కలు త్వరగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నెల 25వ తేది వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


ఈ సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, డీఆర్డీఓ గోపాల్ నాయక్, డియఫ్ ఓ వీణ వాణి, డిపిఓ మురళి, మున్సిపల్ కమిషనర్ సునీత, మున్సిపల్ ఇంజనీర్ మహేష్ , ఎంపిడిఓ లు యంపీఓ లు పంచాయతీ సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు.