కష్టాన్ని ఇష్టంగా భావించాలి.. నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్.!

కష్టాన్ని ఇష్టంగా భావించి కాలాన్ని వృధా చేయకుండా ప్రణాళిక బద్దంగా చదువుకొని అత్యధిక మార్కులు సాధించాలని విద్యార్థులకు నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ సూచించారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట

కష్టాన్ని ఇష్టంగా భావించాలి.. నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్.!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

కష్టాన్ని ఇష్టంగా భావించి కాలాన్ని వృధా చేయకుండా ప్రణాళిక బద్దంగా చదువుకొని అత్యధిక మార్కులు సాధించాలని విద్యార్థులకు నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ సూచించారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రం నందుగల పదవ తరగతి బీసీ వసతి గృహ విద్యార్థులకు స్కిల్ సెంటర్ నందు ప్రేరణ తరగతులు నిర్వహించబడ్డాయి.

మంగళవారం అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కోసము 28 వేల రూపాయల బ్యాంకు చెక్కును వసతి గృహ విద్యార్థుల మీద ప్రేమతో విరాళంగా పిల్లి కండ్ల రామకృష్ణ, ఉపాధ్యాయుడు వారి తల్లిదండ్రులు పిల్లికండ్ల జయశ్రీ వెంకట రాములు చేతుల మీదుగా అదనపు కలెక్టర్ సమక్షంలో జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి చెక్కును అందజేయడం జరిగింది.

ALSO READ : KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!

ఈ విధంగా ఉదారంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పై ప్రేమతో విరాళంగా ఇచ్చినందుగాను అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ , జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి కృతజ్ఞతలు తెలుపుతూ వారిని ఘనంగా సన్మానించారు.

ఇట్టి కార్యక్రమంలో సైకాలజిస్ట్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ సుదర్శన్ విద్యార్థులకు 10వ తరగతి వార్షిక పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి ప్రేరణ కల్పిస్తూ మెళుకువలు వివరించారు. వివిధ సబ్జెక్టుల నిష్ణాతులైన ఉపాధ్యాయులు జిహెచ్ఎం రమేష్ ,పి యాదగిరి, జి క్రాంతి కుమారి, నర్సింగ్ రాజు , షేర్ కృష్ణారెడ్డిచే అత్యధిక మార్కులు సాధించడానికి మెళుకువలు వివరించారు.

ALSO READ : Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!

ఇట్టి కార్యక్రమములో వసతి గృహ సంక్షేమ అధికారులు ఎండి మాసూమ్ ,మసూద్, రేణుక, మంజుల, మోయుజుద్దీన్, ముస్తఫా బీసీ వెల్ఫేర్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.