Narayanpet : తీవ్ర విషాదం.. ప్రభుత్వ పాఠశాలలో పాము కాటుకు గురై విద్యార్థి మృతి..!
నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి రంజిత్ కుమార్ ను తరగతి గదిలో గురువారం పాము కాటుకు గురై మరణించాడు.

Narayanpet : తీవ్ర విషాదం.. ప్రభుత్వ పాఠశాలలో పాము కాటుకు గురై విద్యార్థి మృతి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి రంజిత్ కుమార్ ను తరగతి గదిలో గురువారం పాము కాటుకు గురై మరణించాడు. బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం డిమాండ్ చేశారు.
తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పె పాఠం వింటున్న సమయంలో కిటికీ దగ్గర కుడి చేతికి పాము కాటు వేయడంతో తల్లడించిన విద్యార్థి తనను పాము కారు కరిచిందని అరవడంతో వెంటనే క్లాస్ టీచర్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి తీసుకొని వెళ్లినప్పటికీ ప్రాణాపాయం నుంచి బాలుని రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలో ఆసుపత్రి లేకపోవడము వలన కూడా బాలుడికి సమయానికి వైద్యం అందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
వర్షాకాలంలో పాఠశాల చుట్టూ పిచ్చి మొక్కలు, పొదలు ఉండడం కారణంగా విషపురుగులకు ఆవాసంగా మారినప్పటికీ విద్యాధికారులు పరిశీలించకపోవడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రజలకు భద్రత లేకపోవడం శోచనీయమన్నారు.
పాఠశాల చుట్టూ పరిశుభ్రత ఉంచుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహారించిన ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అన్ని పాఠశాలల్లో ఆసుపత్రులలో పరిశుభ్రత ఉంచే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.









