Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లారాజకీయం

Narayanpet : మైనర్ బాలిక ఆత్మహత్య పై సమగ్ర విచారణ జరిపాలని గవినోళ్ల శ్రీనివాస్ డిమాండ్..!

నారాయణపేట్ జిల్లాకేంద్రంలో మైనర్ బాలిక మృతి చెందడం అత్యంత బాధాకరమైన సంఘటన అని టి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Narayanpet : మైనర్ బాలిక ఆత్మహత్య పై సమగ్ర విచారణ జరిపాలని గవినోళ్ల శ్రీనివాస్ డిమాండ్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట్ జిల్లాకేంద్రంలో మైనర్ బాలిక మృతి చెందడం అత్యంత బాధాకరమైన సంఘటన అని టి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని
ప్రభుత్వాన్ని, పోలీసు అధికారుల ను డిమాండ్ చేశారు. దర్యాప్తును వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించి నిజానిజాలను వెలికితీయా లని కోరారు.బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం, రక్షణ, న్యాయం అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలనీ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు