Narayanpet : పోలీసుల తనిఖీల్లో 53.9 తులాల బంగారం పట్టి వేత..!

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సెంటర్ చౌక్ లో బుధవారం సాయంత్రంవాహనాల తనిఖీలు చేస్తుండగా పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. ఒక వ్యక్తి బ్యాగ్ పట్టుకొని మెయిన్ చౌక్ లో అనుమానాస్పదంగా తిరుగుతు పోలీసులకు కనబడ్డాడు.

Narayanpet : పోలీసుల తనిఖీల్లో 53.9 తులాల బంగారం పట్టి వేత..!

నారాయణపేట టౌన్,  మన సాక్షి:

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సెంటర్ చౌక్ లో బుధవారం సాయంత్రంవాహనాల తనిఖీలు చేస్తుండగా పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. ఒక వ్యక్తి బ్యాగ్ పట్టుకొని మెయిన్ చౌక్ లో అనుమానాస్పదంగా తిరుగుతు పోలీసులకు కనబడ్డాడు.

ఆ వ్యక్తిని పట్టుకొని బ్యాగ్ తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న బ్యాగ్ లో బంగారం వస్తువులు ఉన్నట్లు గుర్తిం చారు. ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా కాటబాతుల రాజా s /o శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరి లో బంగారం వస్తువులు తయారుచేసి నారాయణపేట బంగారం షాపులో అమ్మడానికి వచ్చినాని సమాధానం చెప్పడనీ అతని వద్ద మొత్తం 53. తులాల 09 గ్రాముల బంగారం వస్తువులు వాటి విలువ 17,00,00/- లక్షలు ఉంటుందని అట్టి బంగారాన్ని సంబంధించిన పత్రాలు విచారించగా అతని వద్ద ఎలాంటి పత్రాలు లేనందున బంగారాని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి గ్రివియస్ కమిటీకి అప్పగించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలి పారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, బంగారం, ఇతర విలువైన వస్తువులను రవాణా చేయరాదని ఒకవేళ వాటిని తీసుకెళ్లే సమయంలో తగిన పత్రాలు కలిగి ఉండాలని లేనియెడల వాటీని సీజ్ చేసి గ్రీవియస్ కమిటీకి అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.

ALSO READ : Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!