శ్రీకాకుళం : 21 నుంచి నీలమణి దుర్గ మహోత్సవాలు 

శ్రీకాకుళం : 21 నుంచి నీలమణి దుర్గ మహోత్సవాలు 

మెలియాపుట్టి. మనసాక్షి :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1.30 కోట్ల రూపాయలతో వైభవముగా శ్రీకాకుళం జిల్లా లో పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి మహోత్సవాలు జరుపనున్నట్లు పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు.

 

ఈ సందర్భంగా పాతపట్నం లో డివిజనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ ఈనెల 21 నుండి 30 తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న నీలమణి దుర్గ మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 లక్షల మంది భక్తులు హాజరుకానున్నట్లు అంచనా వేశామన్నారు.

 

అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. పలు సలహాలు సూచనలు చేశారు.

 

ఈ సమీక్ష సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, పలువురు అధికారులు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.