Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుతెలంగాణనల్గొండహైదరాబాద్

No Internet : ఇంటర్నెట్ లేకుండా చాటింగ్… వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.! తెలుసుకుందామా..?

No Internet : ఇంటర్నెట్ లేకుండా చాటింగ్… వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.! తెలుసుకుందామా..?

మన సాక్షి , వెబ్ డెస్క్:

వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఇప్పటికే కొత్త ఫీచర్లతో వాట్స్అప్ అదిరిపోయే అవకాశాలు కల్పిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లో చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ ,ఆఫీస్ మీటింగ్స్, ఇలా అనేక రకాల ఫ్యూచర్ లను తీసుకురావడంతో యూజర్లు ఎక్కువగా వాట్సాప్ ను వినియోగిస్తున్నారు.

 

అన్ని వాడాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ వాడేందుకు వీలు ఉండదు. ఇప్పుడు వాట్సప్ కొత్త ఫీచర్ వచ్చిందని అందరికీ తెలియకపోవచ్చు…. ఆ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ లో చాట్ చేయవచ్చు.

 

వాట్సప్ తీసుకువచ్చే ఏ కొత్త ఫీచర్స్ అయినా యూజర్లకు చాలా ఉపయోగపడుతుంది. వినియోగదారులకు వాట్సాప్ వాడకాన్ని మరింత సులభతరం చేస్తూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.

 

ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ వల్ల మొబైల్ డేటా ఇంటర్నెట్ లేకుండానే వాడవచ్చు. అయితే ఇంటర్నెట్ లేకుండా అసలు ఫీచర్ ఎలా వాడాలి..? నిజంగా ఇది పనిచేస్తుందా..? లేదా..? అనే విషయాలు తెలుసుకుందాం.

 

ఈ వాట్స్అప్ ఫీచర్ ఫ్రాక్సీ… మొబైల్ డేటా లేని సమయంలో కూడా మీరు ఈ వాట్సాప్ ఫ్యాక్సీ ద్వారా చాట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మీరు సెట్టింగ్స్ లో స్టోరేజ్ అండ్ డేటా మీద క్లిక్ చేస్తే లాస్ట్ లో ఫ్లాక్సీ సెట్టింగ్స్ అని ఉంటుంది. మీకు సెట్టింగ్స్ కనిపించకపోతే లేటెస్ట్ వర్షన్ కి వాట్సాప్ అప్డేట్ చేసుకోండి….

 

అది క్లిక్ చేసిన తర్వాత ఫ్లాక్సీ అడ్రస్ ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే చెక్ మార్క్ కనిపిస్తుంది. ఆ తర్వాత చాట్ చేసుకోవడం వీలుంటుంది. అత్యవసరం అయితేనే ఫ్రాక్సీని వినియోగించాలని చెబుతున్నారు. ఎందుకంటే ఫ్యాక్సీ చేయడం వల్ల మీ ఐపి అడ్రస్ ఫ్యాక్సీ ప్రొవైడర్ కు తెలిసిపోతుంది. అలాగే ప్రాక్సీ సమయంలో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆన్ లో ఉందో లేదో కూడా చూసుకోవాలి….

మరిన్ని వార్తలు