జెండా మోసినోళ్లకు టికెట్లు ఇవ్వరా..!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో బిజెపి మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయపాల్‌ రెడ్డికి తీవ్ర అన్యాయం చేసిందని పార్టీ శ్రేణులు ఆవేదనకు గురయ్యారు. శుక్రవారం ఖేడ్‌ లోని ఎంవిఆర్ నివాసంలో కార్యకర్తలు సమావేశమయ్యారు.

జెండా మోసినోళ్లకు టికెట్లు ఇవ్వరా..!

ఖేడ్ లో బీజేపీ కార్యకర్తల ఆందోళన

మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి విజయ్ పాల్ రెడ్డి,

కంగ్టి, నారాయణఖేడ్, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో బిజెపి మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయపాల్‌ రెడ్డికి తీవ్ర అన్యాయం చేసిందని పార్టీ శ్రేణులు ఆవేదనకు గురయ్యారు. శుక్రవారం ఖేడ్‌ లోని ఎంవిఆర్ నివాసంలో కార్యకర్తలు సమావేశమయ్యారు.

నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ చివరి నిమిషంలో పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడం సరి కాదన్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఆలోచించాలని, ఖేడ్‌ లో బలమైన నాయకుడు విజయపాల్‌ రెడ్డిని గుర్తించాలన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ..
గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గంలోబిజెపి జెండాను కేంద్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఎంతో కృషి చేశానని మాజీ ఎమ్మెల్యే ఎం. విజయపాల్ రెడ్డి అన్నారు.

ALSO READ : YS Sharmila : షర్మిల పాలేరులో పోటీ చేస్తుందా.. కాంగ్రెస్ కు మద్దతిస్తుందా..!

ఖేడ్ పట్టణంలోని వారి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం జెండా మోసి నోళ్లకు ఈ పరిస్థితి తీసుకురావడం సరైన పద్ధతి కాదని బిజెపి అధిష్టానం నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికలో పునరాలోచించాలని వారు డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ లో బలమైన అభ్యర్థికి, నియోజకవర్గానికి సేవ చేసిన వ్యక్తి ఉంటే బాగుండు అని ఎక్కడో మీడియాలో పనిచేసిన వ్యక్తినీ తీసుకోవచ్చి పార్టీ పెద్దలు నారాయణఖేడ్ బిజెపి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పై అసహనం వ్యక్తం చేశారు.

సోమవారం లోపు అధిష్టానం పునరాలోచించాలని లేని పక్షాన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యక్రమంలో వెల్లడిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలల అధ్యక్షులు డాక్టర్ శివాజీ, సిద్ధారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మారుతి రెడ్డి, సుబ్బారావు పటేల్ , బాబు సాబ్, మారుతి రావు, జనార్ధన్, అమీన్ సాబ్, నియోజకవర్గ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : కేసీఆర్ పై రాహుల్ సంచలన ట్వీట్..!