దుబ్బాక : నోటీసులకు భయపడే ప్రసక్తి లేదు..!

నోటీసులకు భయపడే ప్రసక్తి లేదు..!

ఎమ్మెల్యే రఘునందన్ రావు

దుబ్బాక, మనసాక్షి :
తెలంగాణలో టోల్గేట్ టెండర్ల విషయంలో జరిగిందని పరువు నష్ట దావ నోటీసు అందిందని తప్పుడు సమాచారం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు.

 

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వానికి టోల్గేట్ టెండర్ విషయంలో తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుందని 1000 కోట్ల పరువు నష్ట దావ నోటీసు అందించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

 

నాకు ఇంతవరకు నోటీసు అంత లేదు అన్నారు. నేను ఒక వకీలు నైనని, నోటీసులకు భయపడే వ్యక్తి రఘునందన్ రావు కాదని తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నారు. ఎవరినో బ్లాక్మెయిల్ చేసే వ్యక్తిని కాదని అన్నారు.

 

Also Read : Good News : దక్షిణ మధ్య రైల్వే లో ఉద్యోగాలు, వేతనం 44,900

 

తెలంగాణ సమాజానికి నష్టం జరిగినట్లయితే 1000 కోట్లు కాదు 10 వేల కోట్లు నష్టపరిహారం ఇస్తానన్నారు. నేను ఒక న్యాయవాది నేనని… కోర్టు నోటీసు అందిన తర్వాత కోర్టులో కొట్లాడుతానన్నారు.

 

నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని.. నోటీసు అందిన తర్వాత సమాధానం చెబుతానని తెలిపారు.