గుర్తు తెలియని మహిళను చేరదీసిన అధికారులు..!

గర్భం దాల్చి మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న 35 ఏండ్ల ఓ మహిళను చేవెళ్ల పోలీసులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ వసనస్థలిపురం అధికారులు చేరదీశారు.

గుర్తు తెలియని మహిళను చేరదీసిన అధికారులు..!

చేవెళ్ల (మన సాక్షి):

గర్భం దాల్చి మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న 35 ఏండ్ల ఓ మహిళను చేవెళ్ల పోలీసులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ వసనస్థలిపురం అధికారులు చేరదీశారు. గురువారం చేవెళ్ల మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామ సమీపం రోడ్డులో తిరుగుతుందన్న సమాచారంతో పోలీసులు, అధికారులు గుర్తించి మహిళను సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌కు వ్యాన్‌లో తరలించారు.

ఈ సందర్భంగా చేవెళ్ల సీఐ భూపాల్‌ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్కేపల్లి గేట్‌ సమీపంలో గర్భం దాల్చి మతి స్థితిమితం లేకుండా ఓ మహిళ తిరుగుతందన్న సమాచారాన్ని ఏఎన్‌ఎం మమ్మాదేవి మహిళా, శిశు సంక్షేమ శాఖకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించిందని, వ్యాన్‌ ద్వారా మహిళను సురక్షితంగా సఖి సెంటర్‌కు తరలించడం జరిగిందన్నారు. కమ్మెట ఐసీడీఎస్ సూపరవైజర్‌ జి.అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మహిళ కన్నడ భాష మట్లాడుతుందని, హైట్‌ 5.5, బ్లాక్‌ స్కిన్‌ కలర్‌ ఉందని తెలిపారు.

ALSO READ : 

BREAKING : ఆ 12 అంశాలపై ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క భేటీ..!

WhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!