దేవరకొండ : వ్యక్తి దారుణ హత్య

దేవరకొండ : వ్యక్తి దారుణ హత్య

దేవరకొండ , మనసాక్షి :

దేవరకొండ పట్టణానికి చెందిన పులిజాల రఘురాములు(38) సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు దేవరకొండ పట్టణానికి చెందిన పులిజాల చంద్రమౌళి జయమ్మ ల ఏకైక కుమారుడు వృత్తిరీత్యా తండ్రి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద దస్తావేజు విలేకరిగా పనిచేస్తున్నారు.

 

చంద్రమౌళి ఆరోగ్యం సహకరించకపోవడంతో రఘురాములు తండ్రి వృత్తిని కొనసాగిస్తున్నారు. దీంతోపాటు విష్ణు కాంప్లెక్స్ లో సెంట్రల్ కిడ్స్ వేర్ ను భార్య శ్రీలక్ష్మి నిర్వహిస్తుంది. మంగళవారం యధావిధిగా స్టాంప్ వెండర్ ఆఫీసు నుండి వచ్చి తన భార్యను బండిపై ఇంటిదగ్గర దింపి ఇప్పుడే వస్తానని చెప్పినట్లు భార్య తెలిపింది . రాత్రి 8 అయినా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసిందని ఎంతసేపటికి ఎత్తలేదని తెలిపింది.

 

మంగళవారం ఉదయం మిషన్ కాంపౌండ్ దగ్గర మృతదేహం పడి ఉందని గుర్తు తెలియని వ్యక్తులు కోట్టి చంపి ఉండవచ్చని తెలిపింది..

 

సంఘటన స్థలానికి డిఎస్పి మేక నాగేశ్వరరావు రూరల్ సీఐ ఎస్సై సతీష్ నల్గొండ నుంచి వచ్చిన క్లూ టీమ్స్ డాగ్స్ స్కాడ్ టీం వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు . భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.