ఆమనగల్లు : ఆపరేషన్ వికటించడంతో యువకుడు మృతి
ఆమనగల్లు : ఆపరేషన్ వికటించడంతో యువకుడు మృతి
ఆమనగల్లు : మనసాక్షి:
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని స్వాతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బుధవారం రాత్రి ఆపరేషన్ వికటించి యువకుడు మృతి చెందినట్లు బంధువులు కుటుంబ సభ్యులు తెలిపారు.
వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండల పరిధి రాంపూర్ గ్రామానికి చెందిన నరేష్ రెడ్డి (25) యువకుడు అపెండెక్స్ నొప్పితో స్వాతి హాస్పిటల్ లో చేరడం జరిగింది. బుధవారం రాత్రి ఆ యువకుడికి వైద్యులు ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ వికటించడంతో నిర్లక్ష్యంగా ఎమర్జెన్సీ పరిస్థితి ఉండడంతో హైదరాబాద్ లోని ఓజోన్ హాస్పిటల్ కు తరలించగా ఆపరేషన్ వికటించి యువకుడు చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
యువకుడు మృతికి కారణమైన ఆమనగల్లు స్వాతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను వెంటనే మూసివేసి తగు చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, రాంపూర్ గ్రామ ప్రజలు ఆమనగల్లులోని హాస్పిటల్ ముందు మృతదేహంతో ధర్నా చేపట్టారు.సీఐ ఉపేందర్,ఎస్ఐ సుందరయ్య,పోలీస్ సిబ్బంది పరిస్థితులను సమీక్షిస్తున్నారు.









