District collector : నేడు వెనుకబడిన కులాల స్థితిగతులపై అభిప్రాయ సేకరణ..!
District collector : నేడు వెనుకబడిన కులాల స్థితిగతులపై అభిప్రాయ సేకరణ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారి పరిస్థితులను తెలుసుకోవడానికి బీసీ కమిషన్ చైర్మన్ వారి సభ్యులు ఈనెల 22న(నేడు) మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
నారాయణపేట జిల్లా లోని సమస్త వెనుకబడిన తరగతుల ప్రజానీకం బీసీ కమిషన్ బృందానికి ఆయా కులాల స్థితిగతులపై తమ అభిప్రాయాలను, ఆక్షేపణ లుఅందజేయవలసినదిగా కోరారు. వ్యక్తులు నమోదుత మరియు నమోదు కాని సంఘాలు తమ వాదనలకు మద్దతుగా తమ వద్ద ఉన్న సమాచారం, సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను కమిషన్ ముందు హాజరై తెలియపరచాలని అన్నారు.
దరఖాస్తు దారులు ధ్రువీకరణ అపీడవిడ్ రూ.20/- నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై (6) పత్రాలను సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం హెచ్ టి టి పి://డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. తెలంగాణ. జిఓవి. ఇన్ (https://www.telangana.gov.in) అనే వెబ్ సైట్ పై ప్రకటన అందుబాటులో ఉంటుందని తెలిపారు.
MOST READ :
-
Gold Price : పసిడికి మరోసారి రెక్కలు.. తులం బంగారం ధర ఎంతంటే..!
-
Jobs Notification : తెలంగాణ డిసిసిబి లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక, నెలకు రూ.25 వేల జీతం..!
-
Ration Cards : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!
-
Viral Video : అమ్మాయికి మెసేజ్ చేశాడని.. ముగ్గురు యువకుల పాశవిక దాడి.. (వీడియో)
-
Viral Video : రీల్స్ పిచ్చి.. ప్రమాదం కూడా గుర్తించని మహిళ.. (వీడియో)









