Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

ఓటరు జాబితా లో పేరు చూసుకున్నారా..!

ఓటరు జాబితా లో పేరు చూసుకున్నారా..!

నేలకొండపల్లి , మన సాక్షి

ఓటర్ జాబితాలో మీ పేరు చూసుకున్నారా.. అందులో మీ పేరు లేకుంటే మళ్లీ నమోదు చేసుకోవాలని నేలకొండపల్లి తహశీల్దార్ ఎస్. శ్వేత ఓటర్లను అడిగి తెలుసుకున్నారు.

 

మండలం లోని వివిధ గ్రామాల్లో ఓటరు నమోదు కార్యక్రమం ను ఆదివారం పరిశీలించారు. ఆజయ్ండా లో కేంద్రం ను సందర్శించి… వివరాలు సేకరించారు. గ్రామంలోని పలువురు ఓటర్ల ను కలిసి ఓటరు జాబితా ను ప్రతీ ఒక్కరూ చూసుకోవాలని… పేర్లు ఉన్నాయో లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

 

ALSO READ : 

  1. Suryapet : సూర్యాపేటలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.. పోటా పోటీగా ధర్నాలు..!
  2. Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !
  3. Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

 

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలు సౌకర్యాల పై బీఎల్వీ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా. ఆమె మాట్లాడారు. అక్టోబర్ 1 తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కు ధరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.

 

సెప్టెంబర్ 19 లోగా ఓట్లు నమోదు కార్యక్రమం నునిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావనా అర్హత కలిగిన వారు సద్వినియోగం.చేసుకోవాలని సూచించారు.అనంతరం గ్రామంలో గృహ లక్ష్మీ దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ళను, క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 

ఇంటి స్థలం ఉందా లేదా.. సొంత స్థలమా, కాదా.. ఇంటి మంజూరుకు అర్హత ఉందా లేదా అని ఇంటింటా తిరిగి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవి. జూనియర్ అసిస్టెంట్ సుందర్ సింగ్. పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ . బూత్ లెవెల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు