Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరంగారెడ్డివ్యవసాయం

పంట నష్టంతో రైతన్న కన్నీరు 

పంట నష్టంతో రైతన్న కన్నీరు 

ఆమనగల్లు ప్రతినిధి , మనసాక్షి:

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు కడ్తాల్ తలకొండపల్లి మండలాలలో పలు గ్రామాలలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి చేతికొచ్చిన పంట నేలపాలయ్యింది. వడగండ్లతో కూడిన ఈదురు గాలుల బీభత్సంతో కురిసిన వర్షానికి రైతులు వేసిన వరి పంట నేల రాలడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

బుధవారం వ్యవసాయ ఆయా మండలాల అధికారులు పంట పొలాలను పరిశీలించి పంట నష్టాన్ని నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతన్నలు కోరుకున్నారు.

మరిన్ని వార్తలు