Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Paddy : తేమ సాకుతో ధాన్యం తూకంలో కోత

Paddy : తేమ సాకుతో ధాన్యం తూకంలో కోత

రైతులతో కలిసి పీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఎర్రటెండ లో ధర్నా

పెన్ పహాడ్ , మన సాక్షి

తేమ పేరుతో రైతులను మోసం చేస్తుండ్రు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కాంటాలను వేగవంతం చేసి బస్తాలను వెంటనే లారీల్లో మిల్లులకు తరలిస్తున్నామని అధికారులు పాలకులు చెబుతున్న అది క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు .

 

మండల పరిధిలోని అనంతారం పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన పరిశీలించినారు .గత నాలుగు రోజులుగా మ్యాచరు సాకుతో కాంటాలు వేయడం లేదని బస్తాకు రెండు కేజీలు కటింగ్ చేస్తామని అధికారులు అంటున్నారని రైతులు తెలపడంతో పిఎసిఎస్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టినారు.

ALSO READ : Talented : వాచ్ మెన్  కూతురు టాలెంట్… అభినందించిన మంత్రి గంగుల..!

 

సీఈవో సరైన సమాధానం ఇవ్వకపోవడంతో చారవాణి ద్వారా కలెక్టర్ కు మ్యాచ్చర్ పేరుతో ప్రతి బస్తాకు రెండు కేజీలు కటింగ్ చేస్తేనే కాంటాలు వేస్తామంటున్నారని విషయం తెలియపరచగా సోమవారం నుండి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్న విరమింప చేసినారు.

 

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గద్దల నాగరాజు, ఉప సర్పంచ్ మామిడి మైసయ్య ,మండలి పిచ్చయ్య, శ్రీరాములు ,గొర్ల అంజయ్య, మామిడి శ్రీనివాస్, వెంకన్న, రవి, సత్యం, రాజు వెంకటేశ్వర్లు, షేక్ జానీ, రంగారెడ్డి, షఫీ ఉల్లా, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు