SURYAPET : సద్దల చెరువులో పైలాన్
సద్దల చెరువులో పైలాన్
రూ. 72 లక్షల వ్యయం తో నిర్మాణం
సూర్యాపేట , మనసాక్షి :
సూర్యాపేట పట్టణంలో ఆహ్లాదానికి నిలయంగా ఉన్న సద్దల చెరువు(మినీ ట్యాoక్ బండ్)కు మరో కొత్త శోభ జత కానున్నది. పైలాన్ నిర్మాణం లో భాగంగా 25 ఫీట్ల ఎత్తుతో చెరువు మధ్యలో 72 లక్షల వ్యయం తో పైలాన్ ఏర్పాటు జరుగనుంది.25 అడుగుల ఎత్తుతో కట్టడం దాని కింది భాగాన ఆహ్లాద కరమైనా గార్డెన్ తో పాటు సేద తీరేందుకు ఒక క్యాంటీన్ ఇతర సౌకర్యాతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ మేరకు శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బల్లకట్టు పై చేరువు మధ్యలోకి వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించారు. పైలాన్ నిర్మాణం పూర్తి అయితే పట్టణ ప్రజలు ఆహ్లాదాన్ని పొందే అవకాశం ఉంది.ఇప్పటికే బోటింగ్ సౌకర్యాన్ని కల్పించిన నేపథ్యంలో పట్టణ ప్రజలకు ఈ ఆహ్లాదపు కట్టడాన్ని త్వరలో అందించనున్నారు. సూర్యాపేట ప్రజలకు ఇది నిజంగానే ఒక వరం గా మారనుంది. ఇలాంటి నిర్మాణాలు సూర్యాపేటలో కూడా ఏర్పాటు చేస్తుండడం హర్షణీయమని పర్యాట ప్రేమికులు పేర్కొంటున్నారు.
ఈ ఆహ్లాద వాతావరణం సాధ్యమైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానునట్టుగా మంత్రి తెలిపారు.ఐలాండ్ ,వాటర్ ఫౌంటయిన్ ,గ్రీనరీ నందు నిర్మించనున్న ఫైలాన్ నిర్మాణము పనులలో భాగంగా ప్రత్యేక బల్ల కట్టు ను తీసుకొని వచ్చిన సందర్భంగా మంత్రి చెరువు అంత తిరిగి పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్, కమిషనర్ రామనుజుల రెడ్డి, ఇ.ఇ.జి.కె.డి .ప్రసాద్ ,డి.ఇ .సత్యారావు,ఏ.ఈ సుమంత్, ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్ ,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.









