మిర్యాలగూడ : పిసిసి అప్రూవల్ లేకుండా నూతన కాంగ్రెస్ కమిటీలు చెల్లవు..!

మిర్యాలగూడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నూతన కమిటీలను పిసిసి అప్రూవల్ లేకుండా నియమించారని పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మిర్యాలగూడ : పిసిసి అప్రూవల్ లేకుండా నూతన కాంగ్రెస్ కమిటీలు చెల్లవు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నూతన కమిటీలను పిసిసి అప్రూవల్ లేకుండా నియమించారని పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ లెటర్ ప్యాడ్ మీద మిర్యాలగూడ నియోజకవర్గంలోని కొన్ని పదవులు రాస్తూ ప్రెస్ మీడియా కి రిలీజ్ చేశారు.

ALSO READ : Train Derails Video : ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన రైలు.. ఇంజన్ క్యాబిన్ లో సీసీ కెమెరా దృశ్యాలు..!

ఇట్టి పదవులకి అధిష్టానం ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షుడు లెటర్ మీద ఈ పదవులకు అధిష్టానానికి అప్రూవల్ కోరుతూ లెటర్ ఉండాలి. పిసిసి అధ్యక్షుడు అప్రూవల్ సంతకం ఉండాలి. కానీ అధిష్టానానికి ఎటువంటి సమాచారం లేకుండా డిసిసి అధ్యక్షుడు లెటర్ ప్యాడ్ మీద ఈ విధమైన పేర్లు రాసి వైరల్ చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము.

ALSO READ : Khairathabad Crocodile : ఖైరతాబాద్ నాలాలో మొసలి ప్రత్యక్షం.. భయాందోళనలో ప్రజలు..!

ఇది నాయకుల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉన్నది. కావున పత్రికా ముఖంగా నాయకులందరికీ విన్నవించుకునేదేమనగా అందరూ సమన్వయంతో ఉండి రాబోయే ఎన్నికలలో ఇక్కడ భాస్కర్ రావును ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నదని ప్రతి నాయకుడిని కోరుకుంటున్నామని తెలిపారు.

ALSO READ : హైదరాబాద్ : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు వేలంపాట.. రూ.1.26 కోట్లు, అది ఎక్కడంటే..!