TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Penpahad : శ్రీనిధి రుణాలలో అవకతవకలు.. వెలుగు చూస్తున్న అక్రమాలు..! 

సూర్యాపేట జిల్లా వెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం మరియు సింగారెడ్డి పాలెం గ్రామాలలో శ్రీనిధి లబ్ధిదారులకు టోపీ పెట్టిన వి బి కే లు మండలంలోని గత నాలుగు రోజులుగా శ్రీనిధి రుణాల అవకతవకలపై నిర్వహించిన సామాజిక తనిఖీల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి.

Penpahad : శ్రీనిధి రుణాలలో అవకతవకలు.. వెలుగు చూస్తున్న అక్రమాలు..! 

పెన్ పహాడ్, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా వెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం మరియు సింగారెడ్డి పాలెం గ్రామాలలో శ్రీనిధి లబ్ధిదారులకు టోపీ పెట్టిన వి బి కే లు మండలంలోని గత నాలుగు రోజులుగా శ్రీనిధి రుణాల అవకతవకలపై నిర్వహించిన సామాజిక తనిఖీల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి. అనంతారం, సింగారెడ్డి పాలెం గ్రామాలలో అనేక అవకతవకలు బయటపడ్డాయి.

అనంతారం గ్రామంలో 30 సంభావన సంఘాలు వి బి కే వన్ సంఘ బంధం కింద కొనసాగుతుండగా అందులో 15 సంఘాలకు చెందిన సభ్యులు 46 మందికి శ్రీనిధి రుణాలు 2018 సంవత్సరం నుండి 2023 సంవత్సరం వరకు మంజూరు చేయగా మంజూరు చేసిన రుణాల అనేక అవకతవక్కలకు పాల్పడ్డట్టు వెల్లడైంది గతంలో అనేక పర్యాయాలు వెలుగులోకి వచ్చిన అధికారులు చర్యలు తీసుకోకపోవడం లో విఫలమయ్యారు అనంతారంలో ఏపీఎం దాసరి అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

గ్రామంలో 46 మందికి శ్రీనిధి నుండి 29 లక్షల 97 వేల 632 రూపాయలు రుణాలు మంజూరు చేయడం జరిగిందని ఇందులో సంఘ బంధం 1 విబికే 9 లక్షల 38 వేల 889 సొంత ఖర్చులకు లబ్ధిదారుల నుండి వసూలు చేసి వాడుకున్నట్లు ఈ సొమ్ము వడ్డీతో సహా 19 లక్షలు అయిందని తెలిపినారు లబ్ధిదారులు కట్టకుండా ఆపడంతో లబ్ధిదారుల నుండి రావాల్సి ఉన్నదని తెలిపారు .

సింగారెడ్డి పాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఒగ్గు కిరణ్ కుమార్ అధ్యక్షతన* సంబంధిత అధికారులు శుక్రవారం జరిపిన సామాజిక తనిఖీలలో అనేక అక్రమాలు బయటపడ్డాయి గ్రామములో, 28 సంఘ బంధాలకు శ్రీనిధి ,పొదుపు, శ్రీనిధి ,పొదుపు నుండి గ్రామంలో మొత్తం జరిపిన వివరాలలో .. బయటపడ్డ దుర్వినియోగం అయిన సొమ్ము 24 లక్షల 18 వేల,244 రూపాయలు అయినట్టు ఏపీఎం అంజయ్య, ఎంక్వైరీ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం అనిల్, డిపిపి కె కిషోర్, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ జ్యోతి, సీసీ పద్మ, తెలిపినారు.

కార్యక్రమంలో సంఘ బంధం అధ్యక్షులు శైలజ ,వివో ఏ పేర్ల గీత తదితరులు పాల్గొన్నారు. మండలంలో వివిధ గ్రామాలలో వి బి కే లకు శ్రీనిధి పొదుపు సంఘాల నుండి ఎత్తుకున్న లోన్ లో ప్రతినెల కట్టవలసిన బకాయిని చెల్లిస్తున్నప్పుడు వి బి కే లు ఎవరు కట్టిన సొమ్ము వారిపై జమ చేయవలసి ఉండగా వేరే సభ్యులకు సొమ్ము జమ చేయడం ఏమిటని గ్రామ సభలలో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు.

పొదుపు సంఘాలలో అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాలలో మహిళలు కోరుతున్నారు… పొదుపు సంఘాల లో పొదుపు సభ్యుల సొమ్ము ఎవరిది వారికి జమ చేయవలసి ఉండగా ఒకరిది మరొకరికి జమ చేయడం ఏమిటని మహిళలు అధికారులను నిలదీసినారు.

MOST READ 

మరిన్ని వార్తలు