Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి..!

Narayanpet : ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం మొగుదుంపూర్ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ విజ్ఞాన సదస్సును పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ కుమార్ మరియు డిఫెన్స్ కౌన్సిల్ కే.లక్ష్మిపతి గౌడ్, డి.దత్తాత్రేయ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు డిఫెన్స్ కౌన్సిల్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం అందరికి సమాన అవకాశాలు కల్పించిందన్నారు.

ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రజలందరు తమ హక్కులను నిర్భయంగా పొందుతారని తెలిపారు. ప్రజలందరు సమానమే ఉన్నవాళ్లు, పేదవాళ్ళు అని తేడా లేదు, పేదరిక నిర్ములనా, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా మరియు వివిధ ప్రభుత్వ పథకాలు, అక్షరాస్యత మరియు చట్టపరమైన అవగాహన మరియు ముఖ్యంగా, సమాజంలోని బలహీన వర్గాలకు హక్కులు, బాల్యవివాహాలు, బాలకార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు.

తమ పిల్లలకు చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేస్తే పెద్దవారిదే తప్పుగా తల్లితండ్రుల నిర్వహణ ఆడది ఆభాల కాదు ఆదిశక్తి, స్త్రీ మరియు పురుష ఆధిక్యత, వరకట్న వేదింపులు, సఖి సెంటర్, ఓల్డ్ ఏజ్ హోమ్, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ప్రయోజనాలపై అవగాహన మరియు న్యాయపరమైన రక్షణ, చట్టపరమైన అవగాహన, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి, అమలు వంటివి న్యాయ సేవా సంస్థ చట్టాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామా స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ భాస్కర్, గ్రామా సర్పంచ్ , సఖి సెంటర్ క్రాంతి, పోలీస్ అధికారి,పార లీగల్ వాలంటీర్స్,అంగన్వాడీ టీచర్లు, ఆషా కార్యకర్తలు గ్రామా ప్రజలు పాల్గొన్నారు.

ALSO READ : Nalgonda : యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి..!

తెలుగులో బ్రేకింగ్ న్యూస్ మన సాక్షిలో చదవండి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ చదవండి.

Home

 

మరిన్ని వార్తలు