Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : పిడుగుపాటుకు గొర్రెల కాపరి, గోర్లు మృతి
పిడుగుపాటుకు గొర్రెల కాపరి, గోర్లు మృతి
అర్వపల్లి , మన సాక్షి :
పిడుగుపాటుకు మూడు గొర్రెలు తోపాటు గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని అడి వేముల గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది.
మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం వడకాల సైదులు (35) మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను కొంతకాల క్రితం అడి వేముల గ్రామానికి బతుకుదెరువు నిమిత్తం వలస వచ్చినట్లు తెలిపారు.
గ్రామంలోని గొర్రెల యజమైన దగ్గర జీతం ఉండి కుటుంబాన్ని పోషిస్తున్నాడు . ఆదివారం సాయంత్రం ఒకసారిగా వచ్చిన గాలి వాన దుమరంతో గొర్రెలని ఇంటికి తోలుకొస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో మూడు గొర్రెలతో పాటు కాపరి సైదులు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.









