పిడుగు పాటుకు యువకుడు మృతి

పిడుగు పాటుకు యువకుడు మృతి

మాడుగులపల్లి,మనసాక్షి:
పిడుగు పడి బాలుడు మృతి చెందిన ఘటన పాములపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.

 

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని పాములపాడు గ్రామానికి చెందిన కూనుకుంట్ల గోపి (19) అనే బాలుడు గొర్రెలను మేపేందుకు వెళ్ళాడు.

 

మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి బాలుడు దగ్గర లో ఉన్న చెట్టు కిందకు వెళ్ళాడు.

 

బాలుడు నిలుచున్న చెట్టు పై పిడుగు పడడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.