రాష్ట్ర స్థాయి నెట్ బాల్ క్రీడకి ఎంపికైన క్రీడాకారులు..!

నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సీనియర్ నెట్ బాల్ సెలక్షన్స్ జరిగినవి. ఈ యొక్క సెలక్షన్స్ కు సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి నెట్ బాల్ క్రీడకి ఎంపికైన క్రీడాకారులు..!

నాగర్జున సాగర్, మన సాక్షి :

నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో గల సెయింట్ జోసెఫ్
హై స్కూల్ నందు ఆదివారం జరిగిన జిల్లాస్థాయి సీనియర్ నెట్ బాల్ సెలక్షన్స్ జరిగినవి. ఈ యొక్క సెలక్షన్స్ కు సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 12మంది బాలురు12 మంది బాలికలు రాష్ట్రస్థాయి టోర్నమెంట్కు ఎంపికైనారు అని నల్లగొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జె కిరణ్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సాగర్(నందికొండ)పట్టణ అధ్యక్షుడు మోహన్ నాయక్ ,హిల్ కాలనీ టౌన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ బాలాజీ నాయక్ ,పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

అలాగే సీనియర్ క్రీడాకారులు అయినటువంటి సంయుత్ నాయుడు మరియు ధనుష్ నాయక్ ఎంపికైన క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు ఈనెల 30వ తారీకు నుంచి ఒకటవ తారీకు వరకు హైదరాబాదులోని దోమలగూడలో జరిగే రాష్ట్రస్థాయి నెట్ బాల్ టోర్నమెంట్కు వెళ్ళనున్నారు.

ALSO READ : 

Gpay : గూగుల్ పే వినియోగదారులకు షాక్.. ఆ సేవలు ఇక బంద్.. ఎప్పటినుంచో తెలుసుకుందాం..!

Whatsapp : వాట్సాప్ లో డిలీట్ ఫర్ ఆల్ కు.. బదులు డిలీట్ ఫర్ మీ నొక్కారా.. అయినా రీస్టోర్ చేసుకోవచ్చు..!

Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!