Pm Sri : ఈ పాఠశాల పిఎమ్ శ్రీ పథకంకు ఎంపికైంది.. !
Pm Sri : ఈ పాఠశాల పిఎమ్ శ్రీ పథకంకు ఎంపికైంది.. !
మఠంపల్లి, మన సాక్షి:
మౌలిక వసతులు కల్పించి సాంకేతిక సొబగులతో ప్రభుత్వ పాఠశాల విద్యను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పధకానికి తెలంగాణ నుండి 543 పాఠశాలలు ఎంపిక కాగ సూర్య పేట జిల్లాలో ఈ పధకం కింద 12 పాఠశాలలు ఎంపిక అయినవి.
అందులో మఠంపల్లి మండలం నుండి మోడల్ స్కూల్ ఎంపిక పట్ల పాఠశాల ప్రిన్సిపల్ సాయిఈశ్వరి మరియు అధ్యాపక బృందం హర్ష వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…
ఈ పధకం కింద పాఠశాలలో సౌర విద్యుత్ ఏర్పాటు, కాయగూరల తోట, శుద్ద జలం,ఐసిటి, క్రీడా ప్రాంగణం, అంతర్జాల సదుపాయం , డిజిటల్ గ్రంధాలయం, వృత్తి విద్యా కోర్సులు, మొదలైనవి సమకూరుతాయని, ఈ మండల విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.
అలాగే ఈ పాఠశాలలు ఎన్ఇపి – 2020 అమలు చేసే మోడల్ పాఠశాలలుగా తిర్చిదిద్దబడుతున్నాయి అని అన్నారు.









