Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

వ్యభిచార గృహంపై ఎస్ఓటి పోలీసుల దాడి

వ్యభిచార గృహంపై ఎస్ఓటి పోలీసుల దాడి

షాద్ నగర్ శ్రీనివాస కాలనీలో ఘటన

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

షాద్ నగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటి ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, షాద్ నగర్ టౌన్ లో శ్రీనివాస్ కాలనీలో గల ఒక ఇంటిలో బ్రోథెల్ హౌస్ నిర్వ హిస్తున్న వారిపై నిన్న సాయంత్రం దాడులు చేసి, బ్రోథెల్ హౌస్ నిర్వ హిస్తున్న ఐదుగురు నిందితులను పట్టుకోని, వారి నుండి బాదితురాలిని కాపాడి, నిందితులను అరెస్టు చేసి జుడీష్యల్ రిమాండ్ కి పంపినట్టు షాద్ నగర్ సిఐ నవీన్ కుమార్ తెలిపారు.

వారి నుంచి 6 సెల్ ఫోన్లు, చేసుకోనీ జరిగింది.
12,500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ముడావత్ తార (40) శ్రీనివాస్ కాలనీ,షాద్ నగర్, స్వగ్రామం ఇంద్రకల్ తాండ, నాగర్ కర్నూలు జిల్లా, కమ్మరి వెంకటేష్ (కమ్మదనం) గ్రామం, యండి. సలీం( కిషన్ నగర్), బాష, అసనుల్లా ఖాన్ ఫరూక్ నగర్, శీలం సాయి కుమార్ ప్రైవేట్ సూపర్ వైజర్, గుండుగేరీ, ఫరూక్ నగర్ వ్యక్తులను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఒక నమ్మ దగిన సమాచారం మేరకు శంషాబాద్ ఎస్ఓటి, షాద్ నగర్ పోలీసులు కలిసి శ్రీనివాస కాలనీ, కిషన్ నగర్ రోడ్, షాద్ నగర్ లోగల ఇంటి నెంబర్ 18-321/6 లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని నమ్మదగిన సమాచారంపై ఇద్దరు పంచులు వెంట తీసుకొని అక్కడికి వెళ్ళి, ఇంటి వద్దకి లోపలికి వెళ్ళి చూడగా ఒక హాల్లో ముగ్గురు మగ వ్యక్తులు ఉన్నారు.

 

వారి పేర్లు తెలుసు కోగా, వెంకటేష్, సాయి కుమార్, సలీం మరియు ఒక ఆడ వ్యక్తి మూడవత్ తార అని చెప్పింది. ఇంటిలో గల ఒక గది లోకి వెళ్ళి చూడగ , అందులో ఒక బెడ్ మీద ఒక మహిళ (బాదితురాలు), ఒక మగ వ్యక్తి నసురుల్లా ఖాన్ అని, చెప్పారు. వెంటనే పొలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని విచారించగ, వీరిలో ముడావత్ తార, వెంకటేష్ లు కలిసి గత కొంత కాలం నుండి శ్రీనివాస్ కాలనీలొ పోర్షన్ అద్దెకు తీసుకొని వ్యభిచారం చేయిస్తున్నారు.

 

వీరికి కర్నూల్ కి చెందిన బాష అను వ్యక్తి ద్వారా అమ్మాయిలను పంపిస్తుంటాడని ఇలా అమ్మాయిలను ఒక వ్యక్తితో గడిపితే 1000రూ.లు ఇస్తామని ఒప్పందం చేసుకొని, ఈ వ్యభిచార గృహాని నడుపుతునారు .ఆ మాదిరిగానే ఒక అనే అమ్మాయిని (బాదితురాలు) గత నాలుగు రోజుల కిందట బాష పంపగా వీరికి సహాయకుడిగా ఒక సలీం అను ఆటొ డ్రైవర్ ను పెట్టుకొని వారి వద్దకి వచ్చే కస్టమర్ లతో డబ్బులు మాట్లాడుతూ ఉంటాడు.

 

ఇద్దరు వ్యక్తులు హస నుల్లాఖాన్, సాయి కుమార్ అనే కస్టమర్లను వెంకటేష్ ద్వారా పిలిపించి, వారిని సలీం ఆటొ డ్రైవరు తీసుకు రాగా వారితో మాట్లాడి ఒక్కొకరికి 1500రూ!!లకు ఓప్పందం చేసుకొని డబ్బులను తీసుకొని, బిజిలి అనే అమ్మాయి వద్దకి హసనుల్లాఖాన్ అనే కస్టమర్ మొదటగా పంపారు, అదే సమయంలో పోలీసులు సాయంత్రం అక్కడికి పంచుల తో వెళ్ళి రైడ్ చేసి ఐదుగురు నిందితులను పట్టుకోని, వారి నుండి బాదితురాలిని కాపాడి, నిందితులను అరెస్టు చేసి జుడీష్యల్ రిమాండ్ కు పంపారు.

మరిన్ని వార్తలు