Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : సైబర్ మోసాల పట్ల పోలీసుల అవగాహణ..!

Miryalaguda : సైబర్ మోసాల పట్ల పోలీసుల అవగాహణ..!

మిర్యాలగూడ/వేములపల్లి, మన సాక్షి:

యువత సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని రావులపెంట గ్రామంలోని సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్ లకు యువత దూరంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితులు తక్షణమే 1930 నెంబర్ కు కాల్ చేయాలన్నారు.రాత్రి వేళలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇసుక రవాణాలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.రైతులకు యూరియా అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Suryapet : నిజాయితీ చాటుకున్న సెక్యూరిటీ..!

  2. Clear Tax : ఏఐ ద్వారా 50 వేలమందికి పైగా ప్రాంతీయ భాషల్లో పన్నుల దాఖలు..!

  3. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాతృత్వం.. ఆ విద్యార్థికి జీవితం..!

  4. Additional Collector : సాదాబ్ బై నామాలపై జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశాలు.. వారికి నోటీసులు ఇవ్వాలి..!

మరిన్ని వార్తలు