Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్వ్యవసాయం

Pomegranate : సిరులు కురుపిస్తున్న దానిమ్మ..!

Pomegranate : సిరులు కురుపిస్తున్న దానిమ్మ..!

రామసముద్రం, మనసాక్షి:

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం సమీపంలోని కర్ణాటక భార్డర్ శ్రీనివాసపురం తాలుక ఎలవంకి పంచాయతీ కి చెందిన రైతు నారాయణ స్వామి తన 5ఎకరాల పొలంలో దానిమ్మ పంట సాగు చేశారు. పంట దిగుబడి బాగా రావడంతో రైతుకు లాబాలు తెచ్చిపెడుతుంది . రైతు ఎన్ టి ఆర్ నారాయణ స్వామి మాట్లాడుతూ మేము ఐదు ఎకరాలలో దానిమ్మ సాగు చేసామన్నారు.

మొక్కలు చిక్ బలాపురం జె యన్ భగవాన్ సీడ్ పెట్టామని మొదటి సంవత్సరం మొక్కలు, ఎరువులు, కూలీలు మొత్తం ఖర్చు 12 లక్ష్మలు అయ్యిందని మొదటి పంట దిగుబడి బాగా రావడంతో 30లక్షలు వచ్చాయన్నారు. రెండవ పంట కోసం 10లక్ష్మలు పెట్టామని పంట అధిక దిగుబడి రావడం తో రైతు కళ్లల్లో ఆనందంతో ఈసారి 40లక్షలు రావచ్చని రైతు తెలిపారు.

పంట రాబడి బాగా రావాలంటే తోటలో పిచ్చి మొక్కలు రాకుండా శుభ్రంగాఉంచాలన్నారు. వారానికి ఒకసారి మందులు కొట్టాలని ఒకసారి మొక్కలకు మందు కొట్టాలంటే ఐదు ఎకరాలకు 15000 ఖర్చు చేయాలన్నారు, రోజు కూలీ ఆడవాళ్లకు 400, మగవారికి 600 ఇస్తామన్నారు. కోతులు, పక్షులు బెడదన్నారు. ప్రతి రోజు కాపలఉండాలన్నారు.

MOST READ : 

రిపోర్టింగ్ వేణు రాజు , రామసముద్రం , అన్నమయ్య జిల్లా

94415 44155

మరిన్ని వార్తలు