Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజాతీయంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

పొట్టేళ్ల బలప్రదర్శన… తరలి వచ్చిన జనం

పొట్టేళ్ల బలప్రదర్శన… తరలి వచ్చిన జనం

మఠంపల్లి, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయ మహోత్సవమును పురస్కరించుకొని శుక్రవారం నాటు పొట్టేళ్ల బలప్రదర్శన పోటీలు శుభోదయం యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పోటీలను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలించారు. ఈ పోటీలను ఫాదర్ మార్టిన్ పసల,బ్రదర్ వినోద్ రెడ్డి,సంఘం అధ్యక్షులు గాదె జయభారత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి ప్రారంభించారు.

 

పోటీల బహుమతులు వివరాలు మొదటి బహుమతి 30,000 వేల రూపాయలు దాత గోపు రాజారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు గోపు రవీందర్ రెడ్డి,రెండవ బహుమతి 20,000 వేల రూపాయలు దాత క్రీర్తి శేషులు గాదె రాయపరెడ్డి సుశీలమ్మ వారి జ్ఞాపకార్థం వారి మనవడు గాదె రవీందర్ రెడ్డి, మూడో బహుమతి 15,000 వేల రూపాయలు దాత క్రీర్తి శేషులు కందుల చిన్న ఆర్ల రెడ్డి జ్ఞాపకార్థం వారి స్నేహితులు గోలమారి జోసఫ్ రెడ్డి, ఆదూరి ప్రేమ్ కుమార్ రెడ్డి ,ఎర్రం రెడ్డి సురేందర్ రెడ్డి ,

నాలుగో బహుమతి 10,000వేల రూపాయలు దాత గొలమారి ఆరోగ్య రెడ్డి గొలమారి జ్యోతి రెడ్డి హైదరాబాద్, ఐదవ బహుమతి 5,000 రూపాయలు దాత కీర్తి శేషులు గోపు రాయపరెడ్డి రాజమ్మ వారి జ్ఞాపకార్థం వారి మనుమలు పోతిరెడ్డి అభిలాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆరో బహుమతి 3,000 వేల రూపాయలు దాత కీర్తి శేషులు మడ్డి గోపయ్య జ్ఞాపకార్థం వారి మేనల్లుడు భాష్యం వీరబాబు యాదవ్ .

 

ఈ యొక్క పోటీలలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రల నుండి 26 పోట్టేళ్ళు పాల్గొన్నాయి. పోటీల్లో గెలుపొందిన వారి వివరాలు మొదటి బహుమతి మునగాల సుబ్బారావు మొర్జాo పాడు గ్రామం పల్నాడు జిల్లా,రెండవ బహుమతి ఎల్లంపల్లి మగాళ్లు ఎన్టీఆర్ జిల్లా, మూడవ బహుమతి గొల్ల నవీన్ రాయపట్నం ఖమ్మం జిల్లా,

 

నాల్గవ బహుమతి భూక్య శ్రీనివాస్ నాయక్ చెరుకు పాలెం ఎన్టీఆర్ జిల్లా, ఐదవ బహుమతి కోమలి అదేశ్ గాజుల దేవరం పాడు ఖమ్మం జిల్లా, ఆరవ బహుమతి లింగాల లక్ష్మీ నందిగామ పల్నాడు జిల్లా వారు గెలుపొందారు. పోటీల అనంతరం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శుభోదయ యువజన సంఘం సభ్యులు చర్చి కమిటీ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు