మిర్యాలగూడ : రేపు ఆ పరిధిలో విద్యుత్ కు అంతరాయం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఈనెల 17వ తేదీన ఆదివారం విద్యుత్ కు అంతరాయం కలగనున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఆపరేషన్ ఏఈ అమర్ సింగ్ తెలిపారు.

మిర్యాలగూడ : రేపు ఆ పరిధిలో విద్యుత్ కు అంతరాయం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఈనెల 17వ తేదీన ఆదివారం విద్యుత్ కు అంతరాయం కలగనున్నట్లు
మిర్యాలగూడ రూరల్ ఆపరేషన్ ఏఈ అమర్ సింగ్ తెలిపారు.

మిర్యాలగూడ మండలం బి అన్నారం సబ్ స్టేషన్ పరిధిలో రేపు ( ఆదివారం) 17 న జప్తి వీరప్పగూడెం , దిరావత్ తండా, బల్లు నాయక్ తండా, జటావత్ తండా, బుడ్డి తండా , అన్నారం ,గద్దగుడు తండా, కేజే ఆర్ కాలనీ, గోనే తండా, దూదియా తండా, నాణ్య తండా, కొత్తూరు, గ్రామాలకు

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కరెంటు గృహ వినియోగదారులు , వాణిజ్య వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి మరియు అధికారులకు సహకరించాలని కోరారు.

Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

కొత్తగూడెం సబ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వినియోగదారులకు కొత్తగూడెం, కిస్థాపురం, గుడురు, లక్ష్మి పురం, రుద్రారం, కలవాగట్టు తండ , హట్యాగాని తండ , కొత్తగూడెం ఇండస్ట్రియల్ ఏరియాలో

సబ్ స్టేషన్ మరమ్మతుల నిర్వహణ కారణంగా ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ సరపరా నిలిపివేయబడును. కావున వినియోగధార్లు సహకరించగలరని మిర్యాలగూడ రూరల్ ఆపరేషన్ ఏఈ అమర్ సింగ్ కోరారు.

ALSO READ : మిర్యాలగూడ : కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్ల విక్రయం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..!