సూర్యాపేట : విద్యుత్ వినియోగంలో తెలంగాణా టాప్ – మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట : విద్యుత్ వినియోగంలో తెలంగాణా టాప్ – మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట , మనసాక్షి
విద్యుత్ వినియోగంలో తెలంగాణా యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. జాతీయ తలసరి వినియోగంతో పోల్చి చూసినట్లయి తెలంగాణా రాష్ట్రంలో 69.40 శాతం విద్యుత్ ను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టించిన అద్భుతం విద్యుత్ రంగంలో విజయాలు అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్దిఉత్సవాలలో బాగంగా
సోమవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని వట్టిఖమ్మం పహాడ్ 400/220/132 సబ్ స్టేషన్ ప్రాంగణంలో విద్యుత్ విజయాలపై నిర్వహించిన విద్యుత్ ప్రగతి సభకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ డి యి శ్రీనివాస్ అధ్యక్షత వహించిన
ALSO READ : Wifi : మీ వైఫై రూటర్ 24 గంటలు ఆన్ లోనే ఉంచుతున్నారా..? అయితే ఇది చూడాల్సిందే ..!
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జడ్ పి వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్, యం పి పి రవీందర్ రెడ్డి,జీవన్ రెడ్డి,కలెక్టర్ వెంకట్రావు ఎస్ పి డి సి ఎల్ సి యి పాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబ్ స్టేషన్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి విద్యుత్ ప్రగతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటుతో చీకట్లు మాయం అయ్యాయని తమస్సుల నుండి ఉషస్సులను సృష్టించిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు.
ఉద్యమ సమయంలో నిండు సభలో నాటి పాలకులు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే చీకట్లో మగ్గుతారంటూ తెలంగాణా సమాజంలో గుబులు పుట్టించిన వారే చీకట్లోకి పోయరని ఆయన ఎద్దేవాచేశారు. రాష్ట్రం ఏర్పడిన రోజున కేవలం 7,778 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలతో ఆ ఉత్పత్తి 18,567 మేఘావాట్లకు చేరుకోవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధికి నిదర్శనమన్నారు.
ALSO READ : App : మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.. లేదంటే మీ డేటా చోరీ అవుద్ది..!
ఇందులో గ్రామీణ ప్రాంతంలో పనిచేసే సిబ్బంది మొదలు యాజమాన్యాల వరకు అందరి శ్రమ ఉందని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశంసించారు. ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో పీక్ డిమాండ్ సమయంలో 13,000 మేఘావాట్లు ఉండగా ఇప్పుడు ఒక్క తెలంగాణా ప్రాంతంలోనే పీక్ డిమాండ్ సమయంలో నమోదు అయిన 14,700 మేఘావాట్లే విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతికి అద్దం పడుతుందన్నారు.యావత్ భారతదేశం నుండి తెలంగాణకు విద్యుత్ ట్రాన్స్ మిషన్ కు తగిన వెసులు బాటు ఉందని ఆయన తెలిపారు.
2014 కు పూర్వం ఎందుకు 24 గంటల ఇవ్వలేక పోయారు.అది ఇప్పుడు ఎలా సాధ్యం అయిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంక్షోభంతో ఎండి పోయిన పంట పోలాలూ తట్టుకోలేక రైతుల ఆత్మహత్యలు దాంతో కుటుంబ సభ్యుల ఆత్మక్షోభ ఒక వైపు క్రాప్ హాలిడేస్ తో రోడ్డెక్కిన పారిశ్రమిక వేత్తల ఆందోళనలతో అట్టుడికి పోయిన దుర్బర పరిస్థితుల నుండి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేదాక చేరుకున్నాం అంటే అది ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విదానమే నన్నారు.
ALSO READ : Railway Stations : విదేశాలకు వెళ్లేందుకు ఫ్లైటే కాదు.. భారత్ లో ఏడు రైళ్లు..! అవి ఎక్కడో తెలుసుకుందాం..!
అటువంటి మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ తోమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి ఏమిటో అని లువిమర్షలు చేసే వారికి విద్యుత్ రంగం లో సాధించిన విజయాలు చెంపపెట్టు లాంటిదన్నారు.