Viral Song : పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన పై సెటైరికల్ సాంగ్.. వైరల్.. మీరు చూడండి.. (వీడియో)
Viral Song : పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన పై సెటైరికల్ సాంగ్.. వైరల్.. మీరు చూడండి.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఇటీవల పుష్ప -2 సినిమా సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గా వ్యవహరించింది. సినిమాలకు బెన్ఫిట్ షోలను కూడా రద్దు చేసింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో బాలుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అంతే కాకుండా ఈ ఘటనపై సినిమా హీరో అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు కావడం, జైలుకు వెళ్లి విడుదల కావడం తెలిసింది. కాగా ఈ ఘటనపై ఓ సెటైరికల్ సాంగ్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. మీరు చూడండి…
(వీడియో)
సంధ్య థియేటర్ తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్
టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.. చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో సాంగ్
Credits: Masala Band pic.twitter.com/U6TuqQDxJO
— Swathi Reddy (@Swathireddytdp) December 29, 2024









