హనుమకొండ | అకాల వర్షం.. రైతన్న అతలాకుతలం

అకాల వర్షం.. రైతన్న అతలాకుతలం

శాయంపేట: మన సాక్షి :

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోఅకాల వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా పాలకులు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా రైతు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు.

 

మంగళవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి మండల కేంద్రం, పలు గ్రామాలలో కొనుగోలు కేంద్రాలలో వరి,మొక్కజొన్న ధాన్యాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో చేసేది ఏమీ లేక రైతులు కన్నీరు అవుతున్నారు.

 

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్న కాంటాలు పెట్టరు,పెట్టిన కంటాలులు ధాన్యం దిగుమతి కాదు, నిర్వాహకులు, వాహనాల గుత్తేదారు మధ్య సమన్వయ లోపంతో కొనుగోలు కేంద్రాలలో భారీగా ధాన్యం నిల్వలు పెరిగిపోయాయి.

 

Also Read : Aadhaar Card : ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త..!

 

కొనుగోలు కేంద్రాలలో వాహనాలు కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతూ గుత్తిదారు కాలం వెల్లదిస్తున్నారు. ఒక వాహనం దిగుమతి చేసిన ధాన్యం దిగుమతి చేసుకోకుండా కుంటి సాకులు చెబుతూ వాహనాలు తిరిగి మళ్ళీ కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని పంపిస్తున్నారు.

 

ఇంత జరిగిన అధికారులు తమకు పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలులో కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి, దిగుమతి చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా మొత్తం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.