Rythu : వర్షాలు లేకపోవడంతో .. ఆ రైతు పంట కాపాడుకునేందుకు ఇలా కురిపించాడు..!
Rythu : వర్షాలు లేకపోవడంతో .. ఆ రైతు పంట కాపాడుకునేందుకు ఇలా కురిపించాడు..!
కంగ్టి, మన సాక్షి :
వానకాలం ప్రారంభమైనా.. సంగారెడ్డి జిల్లాలో మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. వర్షాకాలం ఆరంభంలోనే రైతులకు తిప్పలు తప్పడం లేదు.
వానకాలం పంటల సాగుకు మూడు వారాలు ఆలస్యమైనప్పటికీ అడపాదడపా కురిసిన మోస్తారు వర్షాలు భూమిలో విత్తనాలు వేశారు. మొలకెత్తిన పంటకు వర్షాలు తప్పనిసరి.
ప్రధానంగా రైతులు సోయాబీన్ పంటనే నమ్ముకొని విత్తారు. మరో 4 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పాటు ఎండలు దంచి కొడుతున్నాయి. దాంతో సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం పరిధి బోర్గి గ్రామంలో రైతు బల్లభా రాందాస్ రెండు ఎకరాలు విస్తీర్ణంలో ఓయాబీన్ సాగు చేశాడు.
ALSO READ :
3. PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!
4. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
5. Gruhalakshmi scheme : గృహలక్ష్మీ పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు రావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!
కాగా ఎండలు దంచి కొట్టడంతో మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయి. దానిని కాపాడుకునేందుకు ఆ రైతు తన బోరుకు 56 స్ర్పింక్లర్ల ను ఏర్పాటు చేసి పంటను కాపాడుకుంటున్నాడు. ఆ రైతు సోయాబీన్ పంటకు ఆరుతడి అందించి జీవం పోస్తున్నాడు.
మరో నాలుగు రోజుల తర్వాత వర్షాలు కరువనట్టయితే సోయాబీన్ మొలకలు ఎండిపోతాయని రైతులు వాపోతున్నారు. పంటలు రక్షించుకునేందుకు రైతులు ఇలా చేస్తున్నారని వాటర్ సంస్థ అధికారి రవి ప్రసాద్ తెలిపారు.









