రైతుబంధు సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

రైతుబంధు సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మిర్యాలగూడ టౌన్ డిసెంబర్ 12 మన సాక్షి:

రైతుబంధు సమితి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ (అధ్యక్షులు)గా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు .ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన నియామక పత్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో సోమవారం చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందుకున్నారు.

తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ పల్ల రాజేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, నల్గొండ జిల్లా శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఎంపికకు సహకరించిన ప్రజాప్రతినిధులకు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.తనపై ఉన్న ప్రగాఢ నమ్మకంతో తనకు అప్పగించిన కీలకబాధ్యతలను సమర్థవంతంగానిర్వహిస్తామని అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.