రామచందర్ నాయక్ ను సన్మానించిన నాయకులు 

రామచందర్ నాయక్ ను సన్మానించిన నాయకులు 

మిర్యాలగూడ, సెప్టెంబర్ 28, మన సాక్షి : తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన ఇస్లావత్ రామచందర్ నాయక్ ను బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ ఎస్సి ఎస్టీ మైనారిటీ లు రాజకీయంగా ఎదగాలని అన్నారు.

ఈ పదవుల ద్వారా సామాజిక వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్నాల వెంకన్న యాదవ్,బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్, యాదవ్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడు గుడిపాటి కోటయ్య యాదవ్, ఉద్యోగుల సంఘం గాయకుడు శ్రీనివాస్ యాదవ్ దారం మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.