మిర్యాలగూడ : బియ్యం గోదాముల ఆకస్మిక తనిఖీ..!

రేషన్ కార్డు దారులకు సకాలంలో రేషన్ బియ్యం ఇవ్వాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. మిర్యాలగూడ లోని బాపూజీ నగర్ లో ఉన్న బియ్యం గోదాములను సివిల్ సప్లై డిఎం నాగేశ్వరావుతో కలిసి బుధవారం ఆకస్మికంగా సందర్శించి బియ్యం నిల్వలను పరిశీలించారు.

మిర్యాలగూడ : బియ్యం గోదాముల ఆకస్మిక తనిఖీ..!

సకాలంలో రేషన్ బియ్యo ను పంపిణీ చేయాలి

 గోదాములను పరిశీలించిన డీఎస్ఓ, డిఎం

మిర్యాలగూడ, మన సాక్షి:

రేషన్ కార్డు దారులకు సకాలంలో రేషన్ బియ్యం ఇవ్వాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. మిర్యాలగూడ లోని బాపూజీ నగర్ లో ఉన్న బియ్యం గోదాములను సివిల్ సప్లై డిఎం నాగేశ్వరావుతో కలిసి బుధవారం ఆకస్మికంగా సందర్శించి బియ్యం నిల్వలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లకు ఈనెల 29వ తేదీలోపు బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. 29వ తేదీ నాటికి అన్ని రేషన్ దుకాణాలలో రేషన్ బియ్యం ఉండాలని సూచించారు. డీలర్లు కార్డుదారుల నుండి బియ్యం కొనుగోలు చేయవద్దని అలా చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ALSO READ : చెరువుమాధారం చెరువు కట్ట పై ఉద్రిక్తత…! చేపల టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు..!

రేషన్ కార్డుదారులు డీలర్ కు బియ్యం అమ్ముకోవద్దని సూచించారు. గతంలో ప్రతినెల 5వ తేదీన రేషన్ షాపులు తెరిచి బియ్యం ఇచ్చేవారని అలా కాకుండా మార్చి నెల నుండి ఒకటో తేదీ నుండి రేషన్ షాపులు తెరిచి బియ్యం ఇవ్వాలన్నారు. డీలర్లు సమయపాలన పాటించాలని కోరారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఆర్ఐ సురేందర్ సింగ్, గోదాం ఇన్చార్జి సుధాకర్ తదితరులు ఉన్నారు.

ALSO READ : BREAKING : యువతిని వేధించిన యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష..!