Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 న కొత్త రేషన్ కార్డుల పంపిణి..!
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది

Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 న కొత్త రేషన్ కార్డుల పంపిణి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఆగస్టు 15వ తేదీ నుంచి రేషన్ కార్డుదారులందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డులు (పివిసి కార్డులను) పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల పి వి సి రేషన్ కార్డులు ఇప్పటికే సిద్ధమయ్యాయి. పంపిణీ కోసం ఆయా జిల్లాలకు పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసింది. ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
అదేరోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పీవీసి రేషన్ కార్డుల తో సంక్షేమ పథకాలకు కూడా లింకు పెట్టే అవకాశం ఉంది. కేవలం రేషన్ కార్డులు రేషన్ సరుకుల కోసమే కాకుండా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికి కూడా ఈ కార్డులే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.









