కమనీయం..శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం..!

కమనీయం..శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం..!

కనగల్ , మన సాక్షి:

భక్తుల కొంగు బంగారం నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని ధర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం అమ్మవారు – జమదగ్ని మహామునిల కళ్యాణం వైభవంగా జరిగింది.

 

ఉత్సవ విగ్రహాలను ప్రధాన ఆలయంలో వేద పండితుల పూజల అనంతరం పల్లకిలో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తరలించారు. మంగళ వాయిద్యాలతో వేద పండితుల బృందం మంత్రోచ్ఛారణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.

 

నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. లోక కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి వడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

 

Also Read : Good News : దక్షిణ మధ్య రైల్వే లో ఉద్యోగాలు, వేతనం 44,900

 

అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్ ప్రధాన ఆలయంలో పూజలు చేసిన అనంతరం కళ్యాణంలో పాల్గొన్నారు. కోలాట ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

 

ఇదిలా ఉంటే వర్షం కారణంగా భక్తులకు కొంత అసౌకర్యం కలిగింది. బ్రహ్మోత్సవాల నాలుగో రోజు బుధవారం దర్వేశిపురం, పర్వతగిరి గ్రామస్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించనున్నారు. సాయంత్రం పురవీధుల్లో అమ్మవారు జమదగ్ని మహామునిల ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.

 

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జల్లేపల్లి జయరామయ్య, ఎంపీపీ కరీం పాషా, జెడ్పిటిసి చెట్ల వెంకటేశం, పిఎసిఎస్ చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్ రావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య, దర్వేశిపురం సర్పంచ్ అలుగుబెల్లి పూలమ్మ, ఎంపీటీసీ శైలజా సైదులు,

 

Also Read : Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!

 

పర్వతగిరి సర్పంచ్ అంజమ్మ రామచంద్రు, ఆలయ మాజీ చైర్మన్లు నల్లబోతు యాదగిరి, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, నాయకులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎరెడ్ల సుధాకర్ రెడ్డి, జనుకుంట్ల రాములు, అంజయ్య, ఆలయ సిబ్బంది జినుకుంట్ల చంద్రయ్య,

 

చిలుక రాజు లింగయ్య, ఆలయ అర్చకులు నాగోజు మల్లా చారి, శ్రవణాచారి, మహేష్, దామోదర్, నాగరాజు, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.