Telangana : రేవంత్ సొంత దుకాణానికి సిద్ధం.. భట్టిని సైడ్ చేసే ప్రయత్నం..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ తో చేతులు కలిపి సొంత దుకాణం పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని బిజె ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలనం చేశారు.

Telangana : రేవంత్ సొంత దుకాణానికి సిద్ధం.. భట్టిని సైడ్ చేసే ప్రయత్నం..!

గేట్లు ఓపెన్ చేసిన పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు రాలేదు

తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు బిజెపి గెలవబోతోంది

బీజే ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మన సాక్షి:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ తో చేతులు కలిపి సొంత దుకాణం పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని బిజె ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలనం చేశారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం పదిమంది ఎమ్మెల్యేలతో సిద్ధంగా ఉన్నారని అన్నారు. సొంత పార్టీ వాళ్ళ వలన రేవంత్ రెడ్డి అభద్రతాభావంతో ఉన్నారని పేర్కొన్నారు.

 

గేట్లు ఓపెన్ చేసినా.. పట్టుమని పదిమంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాలేదన్నారు. బై ఎలక్షన్ అంటూ వస్తే ప్రజలు బిజెపి వైపు ఉంటారని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 12 సీట్లు గెలవబోతుందని ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ సీటు ఓడిపోతామనే విషయం రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను సైడ్ చేసే ప్రయత్నం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ముఖ్యమంత్రి పదవి కోసం పది మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారని, భట్టి తొమ్మిది శాతం బి టాక్స్ లీక్ కాంగ్రెస్ వల్లే ఇచ్చారన్నారు. భట్టిని పక్కనపెట్టి సెకండ్ పొజిషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రెండో స్థానంలోకి వస్తే తర్వాత మొదటి స్థానం కోసం ప్రయత్నాలు జరుగుతాయని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని , చంద్రబాబు లాగానే రేవంత్ కూడా వెన్నుపోటు పొడుస్తాడన్నారు.

 

కాంగ్రేస్ లో ఎల్లో, పింక్, గాంధీ కాంగ్రెస్ ఉన్నాయన్నారు. ప్రజల ఆశీర్వాదం తోనే తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.