మిర్యాలగూడ : మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి మహర్షి రైస్ మిల్లు ఎదుట మృతదేహంతో ధర్నా

మిర్యాలగూడ : మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి మహర్షి రైస్ మిల్లు ఎదుట మృతదేహంతో ధర్నా

అద్దంకి – నార్కెట్పల్లి రహదారిపై రాస్తారోకో చేపట్టిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు

కిలోమీటర్లు మేర నిలిచిన వాహనాలు ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

వేములపల్లి జూలై 15, మన సాక్షి

వేములపల్లి మండలంలోని శేట్టిపాలెం గ్రామానికి చెందిన నక్క వెంకటయ్య జానకమ్మ దంపతులకు రెండవ సంతానం మైన సురేష్ (24)గ్రామ శివారులోని మహర్షి రైస్ మిల్లులో మిల్లు డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

 

కాగా ఈనెల 9వ తేదీన మిల్లు నుంచి తన సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడకు వెళ్లి వస్తుండగా ఏడు కోట్ల తండాకు సమీపంలో ఉన్న ఒక హోటల్ వద్దకు రాగా వెనుక నుంచి ఒక లారీ వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన సురేష్ కు చికిత్స నిమిత్తము నల్లగొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతుండగా రాత్రి 9 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

 

ALSO READ ; 

1. Telangana : తెలంగాణ ఎన్నికలకు ముందే ఐడి కార్డు ఉంటే సరిపోదు.. ఓటర్ల జాబితాలో మీ పేరు.. ఉందో? లేదో? ఇలా చూసుకోండి..!

2. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

3. GPay : గూగుల్ పే గుడ్ న్యూస్ .. కొత్త ఫీచర్.. యూపీఐ లైట్ సదుపాయం..!

 

 

మృతి చెందిన సురేష్ ఎనిమిది మాసాల కిందట వివాహం కాగా భార్య నాలుగు మాసాల గర్భిణీ కావడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నుంటాయి. యాజమాన్యం కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలంటూ మిల్లు ఎదుట మృతదేహంతో రాస్తారోకో.

 

రెక్కాడితే కానీ డొక్కాడని పే ద కుటుంబానికి చెందిన సురేష్ మృతితో ఆ కుటుంబం వీధిన పడాల్సిన పరిస్థితి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
మిల్లు యాజమాన్యం వారు కార్మిక భీమా చేసినట్లయితే తమకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేదని సురేష్ కి కార్మిక బీమా చేయని మిల్లు యాజమాన్యం వారు తమకు ఆర్థిక సాయం అందించే ఆదుకోవాలని మిల్లు ఎదుట రాస్తారోకో చేపట్టారు.

 

ఈ రాస్తారోకో సందర్భంగా గంటకు పైగా రోడ్డుపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి వాహనంలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు విషయం తెలిసిన స్థానిక ఎస్సై ఎన్. శ్రీను రాస్తారోకో వద్దకు వెళ్లి మిల్లు యాజమాన్యంతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి రాస్తారోకోని విరివింపచేసాడు