NALGONDA: నల్లగొండలో రింగ్ రోడ్డు కాదు.. దొంగ రోడ్డు, లబ్ధికోసమే ప్లాన్ త్రీ..! 

మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలవారు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డి ని కలుసుకొని రింగ్ రోడ్డు ఆప్షన్ త్రీ ని రద్దు చేయాలని వినతి పత్రం సమర్పించారు.

NALGONDA: నల్లగొండలో రింగ్ రోడ్డు కాదు.. దొంగ రోడ్డు, లబ్ధికోసమే ప్లాన్ త్రీ..! 

నల్లగొండ , మనసాక్షి :

మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ రింగ్ రోడ్ బాధిత కుటుంబాలవారు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డి ని కలుసుకొని రింగ్ రోడ్డు ఆప్షన్ త్రీ ని రద్దు చేయాలని వినతి పత్రం సమర్పించారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ
తాము స్వయంగా స్థల పరిశీలన జరిపి ప్రభుత్వం తోనూ ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులతోను మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం మీడియా తో కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ .
ఇది రింగ్ రోడ్ కాదు దొంగ రోడ్ అని.తమ అనుచరులకు దోచి పెట్టడానికి మంత్రి నాటకం ఆడుతున్నారని… 3000 కుటుంబాలు తాము కష్టపడి చమటోడ్చి… సంపాదించుకున్న ప్లాట్లు ఇండ్లు నష్ట పోతున్నా పట్టించు కోకుండా అధికారం ఉందనే అహంకారం తో మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని బాధితుల గోడు పట్టించుకోవట్లేధన్నారు.

 

అందరికి ఆమోదయోగ్యమైన.. ప్లాన్ 1,2, వదిలేసి తమ అనుచరుల లబ్ధికోసం ప్లాన్ 3 ఎంచుకున్నారని ఆరోపించారు.తక్షణం… ప్లాన్ 3 ఉపసంహారించుకోవాలని లేకుంటే బాధితుల తరుపున తాము పోరాడుతామని…
15 రోజుల సమయం ఇస్తున్నామని ఈలోగా ప్లాన్ 3 ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే…ఎంతమంది బాధితులున్నారో వారందరి తో కలిసి పాదయాత్ర చేస్తామని ఆతర్వాత.. ఉత్తర్వులు రద్దు చేసేవరకు దశల వారీగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

భారీ ఎత్తున రింగ్ రోడ్ బాధితులతో పాటు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రెగట్టే మల్లిఖార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కాంచనపల్లి రవీందర్ రావు, జమాల్ ఖాద్రి, కౌన్సిలర్ మారగోని గణేష్, మెరుగు గోపి, షంశుద్దీన్, గంజి రాజేందర్, వజ్జే శ్రీనివాస్, దొడ్డి రమేష్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

BIG BREAKING : పోచారంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం..!

Suicide : కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య..!