రోడ్డు ప్రమాదం…మిర్యాలగూడ వాసి మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని గూడూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది.

రోడ్డు ప్రమాదం…మిర్యాలగూడ వాసి మృతి

– వినోద్ భౌతికకాయాన్ని సందర్శించి భాస్కర్ రావు

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని గూడూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలోని తాళ్ళవీరప్పగూడెం గ్రామానికి చెందిన, టీఎస్ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్న పోకల వినోద్ కుమార్ (29) మృతి చెందారు.

ALSO READ : మనసాక్షి నూతన సంవత్సర 2024 క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

వినోద్ భౌతిక కాయాన్ని బంధుమిత్రులు సందర్శనార్థం తాళ్ళవీరప్పగూడెంలోని నివాసం వద్ద ఉంచారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు వినోద్ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి పూలమాలతో నివాళి అర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపుడి నారాయణ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, నాయకులు అంగోతు హాతిరాం తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : లెఫ్ట్..రైట్.. హార్సిలీహిల్స్ లో మిట్స్ విద్యార్థుల ట్రెక్కింగ్…!!