మిర్యాలగూడ : రోడ్డు ప్రమాద మృతులకు బిఎల్ఆర్ సహాయం

మిర్యాలగూడ : రోడ్డు ప్రమాద మృతులకు బిఎల్ఆర్ సహాయం

మిర్యాలగూడ, మన సాక్షి:

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా బంధువుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కూలీల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి ఎన్ ఆర్ సహాయం ప్రకటించారు.

 

దామరచర్ల మండలం నర్సాపూర్ కు చెందిన గిరిజన కూలీలు ఆంధ్రప్రదేశ్ లోని పులిపాడుకు ఆటోలో వెళుతుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యులను మిర్యాలగూడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బిఎల్ఆర్ పరామర్శించారు.

 

అనంతరం చనిపోయిన గిరిజన మహిళల కుటుంబాలకు 10,000/- వేల రూపాయల చొప్పున ఆరుగురి కుటుంబాలకు 60,000/- వేల రూపాయలు ప్రకటించారు.